Traffic restrictions in Gachibowli Hyderabad from tomorrow to January 19 : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జంక్షన్​ (Gachibowli Junction) వద్ద గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (Greater Hyderabad Municipal Corporation) చేపడుతోన్న ఫ్లై ఓవర్ (Gachibowli flyover) గిడ్డర్ పనుల వల్ల జనవరి 10 నుంచి జనవరి 19వ తేదీ వరకు రోడ్డును మూసివేయనున్నారు. రాత్రి 11 నుంచి ఉదయం 6 వరకు గచ్చిబౌలి నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ (Bio-Diversity Junction) వరకు రోడ్డును క్లోజ్ చేయనున్నారు. రేపటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 10 రోజుల పాటు రాత్రి వేళల్లో ఈ రూట్‌లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాహనాల దారి మళ్లింపు ఇలా ఉండనుంది. హఫీజ్​పేట​ (Hafeezpet) నుంచి కొత్తగూడ మీదుగా టోలిచౌకి వైపు వెళ్లే వాహనాలు రోలింగ్ హిల్స్ రోడ్, ఏఐజీ హాస్పిటల్, (AIG Hospital) మైండ్ స్పేస్​ జంక్షన్, (Mind Space Junction) బయోడైవర్సిటీ జంక్షన్​ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 


లింగంపల్లి (Lingampally) నుంచి టోలిచౌకి వైపు వెళ్లే వాహనాలన్నింటినీ నానక్ రామ్ గూడ, (Nankramguda) ఖాజాగూడ (Khajaguda) మీదుగా మళ్లించనున్నారు. ఎయిర్ పోర్టు నుంచి ఓఆర్ఆర్​ మీదుగా టోలిచౌకి (Tolichowki) వైపు వెళ్లే వాహనాలన్నీ కూడా గచ్చిబౌలి జంక్షన్​ దగ్గర యూటర్న్​ (U-turn) తీసుకుని ఓఆర్ఆర్​ మీదుగా నానక్​రాంగూడ, (ORR-Nanakramguda) ఖాజాగూడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.


టోలిచౌకి (Tolichowki) నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు అన్నీ కూడా​ ఖాజాగూడ జంక్షన్​, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నానక్​రాంగూడ రోటరీ‌‌-1, రోటరీ‌‌-2 (Rotary – II) నుంచి రైట్‌కు ​టర్న్​ చేసుకుని ఓఆర్​ఆర్​ మీదుగా గచ్చిబౌలి జంక్షన్​ నుంచి లెఫ్ట్‌కు టర్న్ తీసుకుని లింగంపల్లి వైపు వెళ్లాల్సి ఉంటుంది.


Also Read : Rajendra Prasad: కరోనాతో ఆసుపత్రిలో చేరిన నటుడు రాజేంద్ర ప్రసాద్


ఇక టోలిచౌకి (Tolichowki) నుంచి లింగంపల్లి వైపు వచ్చే వాహనాలన్నీ కూడా బయోడైవర్సిటీ దగ్గరకు చేరుకొని అక్కడి నుండి ఐకియా, మీనాక్షి సిగ్నల్​, (Meenakshi Signal) ఏఐజీ హాస్పిటల్​, రోలింగ్​ హిల్స్‌​ రోడ్ నుంచి మెయిన్​ రోడ్‌కు (Road) చేరుకుని యూటర్న్​ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రాడిసన్ హోటల్, డీఎల్ఎఫ్​ రహదారి (DLF Road) నుంచి ఐఐఐటీ సిగ్నల్​ (IIIT Signal) వద్దకు చేరుకుని యూటర్న్​ (U Turn) తీసుకుని.. లింగంపల్లి వైపునకు వెళ్లాల్సి ఉంటుంది.


Also Read : Price alert: 5-10 శాతం పెరగనున్న గృహోపకరణాల ధరలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook