Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టెక్కీ మృతి.. 20మీ. ఈడ్చుకెళ్లిన టిప్పర్..

Hyderabad Road Accident:  తెల్లవారుజామున 5గం. సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్ ఆగకుండా ముందుకు దూసుకెళ్లిందని తెలిపారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2022, 12:42 PM IST
  • కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం
  • టిప్పర్ ఢీకొట్టడంతో టెక్కీ మృతి
  • రోడ్డుపై 20మీ. ఈడ్చుకెళ్లిన టిప్పర్
Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టెక్కీ మృతి.. 20మీ. ఈడ్చుకెళ్లిన టిప్పర్..

Hyderabad Road Accident: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం (Kukatpally Accident) చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని టిప్పర్ (Tipper hits Bike) ఢీకొట్టింది. రోడ్డుపై అతని 20 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం (జనవరి 9) తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతుడిని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ (Software Engineer) జగన్ మోహన్‌ రెడ్డిగా గుర్తించారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమ‌త్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున 5గం. సమయంలో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్ ఆగకుండా ముందుకు దూసుకెళ్లిందని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో చోటు చేసుకున్న మరో రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఎల్బీనగర్ (LB Nagar) అండర్ పాస్‌లో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. శనివారం (జనవరి 9) అర్ధరాత్రి తర్వాత ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. గాయపడ్డ యువకులను పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్, నగర శివారు ప్రాంతాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు (Road Accidents in Hyderabad) చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది.

Also Read: Ramesh Babu cremation: సోదరుడి అంత్యక్రియలకు మహేష్ దూరం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News