హైదరాబాద్: నెహ్రూ యువ కేంద్ర సంఘటన ఆధ్వర్యంలో ఐదు రాష్ట్రాల గిరిజనుల సాంప్రదాయాలపై  హైదరాబాద్, రాజేంద్రనగర్ లో జరిగిన 12వ ట్రైబల్ యూత్ ఎక్సెంజ్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్  హాజరయ్యారు. తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ సమావేశంలో మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల్లో ఉన్న ఆదివాసి పిల్లలు నేడు ఈ స్థాయికి వచ్చి వారి ఆచార, వ్యవహారాలు, సాంప్రదాయాలు తెలియజేయడం ఆనందించే విషయమని ఆమె పేర్కొంటూ  వారందరికీ శుభాశిస్సులు తెలియజేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యువత అంటే శక్తి…ఈ యువతే భావి భారత పౌరులు…మన దేశం గర్వించే స్థాయికి ఎదగాలి. ఇక్కడున్న విద్యార్థులు ఈ స్థాయికి రావడం మంచి అవకాశం రావాలని ఆమె అన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు, గురువులు విద్య మంచి, చెడులు నేర్పుతారు, కానీ ఆదివాసి బిడ్డలకు తల్లిదండ్రులు పెద్దగా చదువులేనివారు కావడంతో గురువులే వారికి సర్వస్వమని, వారి సేవలను కొనియాడారు. 


ప్రభుత్వాలు ఎంత చేయుతనిచ్చిన  నేర్చుకునే విద్య విలువలతో కూడినదై ఉండాలని, దీనికి ఉపాధ్యాయులపైనే గురుతర బాధ్యత ఉంటుందని ఆమె అన్నారు. సమాజంలో యువతకు చాలా బాధ్యత ఉంటుంది. ఇటీవల కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగాయని, ఎవరో ఒకరు చేసిన దానికి అందరిమీద ఆ ప్రభావం ఉంటోందని, కాబట్టి ఇలాంటి వాటి విషయంలో యువత జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.


మన ఆచార, వ్యవహారాలను, సంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని, పిల్లలు వారి లక్ష్యాలను చేరుకోవడంలో ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని ఆమె పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..