Target Modi: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ సహా బీజేపీ అగ్రనేతలంతా హైదరాబాద్ వస్తున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉండబోతున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనే భాగంగానే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు దాదాపు 10 లక్షల మందిని సమీకరించాలని తెలంగాణ కమలనాథులు శ్రమిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ సభ ద్వారానే వచ్చే ఎన్నికలకు శంఖారావం పూరించనుంది బీజేపీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణపై ఫోకస్ చేసిన బీజేపీ పెద్దలకు అదే స్థాయిలో కౌంటరిచ్చే ప్రయత్నం చేస్తోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. కొంతకాలంగా బీజేపీని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్న సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీ అధికారిక పర్యటనలో హైదరాబాద్ వచ్చినా పట్టించుకోలేదు. ప్రధాని వచ్చే రోజున బెంగళూరు వెళ్లారు. అంతకుముందు ముచ్చింతల్ శ్రీరామనగరానికి ప్రధాని వచ్చినప్పుడు జ్వరం సాకుతో పర్యటనకు దూరంగా ఉన్నారు కేసీఆర్. ప్రధాని మోడీకి కనీసం ఆహ్వానం కూడా పలకలేదు. తాజాగా బీజేపీ జాతీయ సమావేశాల కోసం హైదరాబాద్ వస్తున్న మోడీకి.. మరోరకంగా ట్రీట్ ఇవ్వబోతున్నారు సీఎం కేసీఆర్. ఈసారి మోడీ వస్తున్నది రాజకీయ కార్యక్రమం కావడంతో.. రాజకీయ క్రీడలో భాగంగా కేసీఆర్ షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా  హైదరాబాద్ ను కాషాయమయం చేయాలని కమలనాధులు ప్లాన్ చేస్తున్నారు. అయితే వాళ్లకు ఆ అవకాశం ఇవ్వకుండా గులాబీ మయం చేసేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.


హైదరాబాద్ లో బీజేపీ కటౌట్లు, హోర్డింగులు, ఫ్లెక్సీలకు అవకాశం లేకుండా చేస్తోంది గులాబీ పార్టీ. నగరంలో టీఆర్ఎస్ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ లోని మెట్రో పిల్లర్లను రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలిపేలా  ప్రకటనలతో నింపేయబోతోందని తెలుస్తోంది. ఈ మేరకు మెట్రో రైల్, ఎల్ అండ్ టీ సంస్థతో యాడ్ ఏజెన్సీ ద్వారా టీఆర్ఎస్ డీల్ చేసుకుందని సమాచారం. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే రెండు రోజులతో పాటు ముందు, వెనుక రోజుల్లో  మెట్రో పిల్లర్లను టీఆర్ఎస్ తమ ప్రకటనల కోసం బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జూలై 2, 3 తేదీల్లో మాదాపూర్ హైటెక్స్ లోని నోవాటెల్ హోటల్‌లో జరగనుంది. పార్టీ సీనియర్ నేతలు ఒక రోజు ముందే హైదరాబాద్ వస్తున్నారు. బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు రెండు రోజులు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. ఈ సమయంలోనే హైదరాబాద్ లో తమ సర్కార్ పథకాలను తెలిసేలా మెట్రో పిల్లర్లకు ప్రకటనలు ఇవ్వబోతోంది టీఆర్ఎస్.


హైదరాబాద్ లోని మూడు కారిడార్లలో మొత్తం రెండున్నర వేలకు పైగా పిల్లర్లు ఉన్నాయి. ఈ మెట్రో పిల్లర్లపై కేసీఆర్ సర్కార్ బోర్డులు దర్శనమివ్వనున్నాయి. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు 1108 పిల్లర్లు, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కారిడార్ లో 356 పిల్లర్లు ఉండగా..  నాగోల్ నుంచి రాయదుర్గం మార్గంలో 1052 మెట్రో  పిల్లర్లు ఉన్నాయి. ఈ మూడు మార్గాల్లోని పిల్లర్లను గులాబీ పార్ట్ బుక్ చేసిందని తెలుస్తోంది. అమీర్ పేట నుంచి మియాపూర్, రాయదుర్గం రూట్లలో భారీగా ప్రకటనల బోర్డులు ఉండేలా ప్లాన్ చేస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా మెట్రో పిల్లర్లపై ప్రచారానికి బీజేపీకి అవకాశం లేకుండా చూడటానికే టీఆర్ఎస్ ఇలా ప్లాన్ చేసిందని చెబుతున్నారు. అదే సమయంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే కమలం నేతలకు తెలంగాణ సర్కార్ పథకాల గురించి తెలిసేలా ఇంగ్లీష్, హిందీలోనూ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని  తెలుస్తోంది. టీఆర్ఎస్ తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Read also: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో పండగే.. ఒకేసారి మూడు కానుకలు..  


Read also: Atmakur Result: ఆత్మకూరులో బీజేపీ డిపాజిట్ గల్లంతు.. లక్ష దాటని వైసీపీ మెజార్టీ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి