Atmakur Bypoll Results 2022: ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పై 82,888 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆత్మకూర్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఏకపక్షంగానే సాగింది. మొదటి రౌండ్ లోనే ఐదు వేలకు పైగా లీడ్ సాధించిన విక్రమ్ రెడ్డి.. ప్రతి రౌండ్ లోనూ భారీ ఆధిక్యం సాధించారు. వైసీపీని ఓడిస్తామని ప్రకటించిన బీజేపీ అభ్యర్థి ఏకంగా డిపాజిట్ కోల్పోయారు. బీఎస్పీ అభ్యర్థి మూడో స్థానంలో నిలవగా.. నోటాకు నాలుగు వేలకు పైగా ఓట్లు వచ్చాయి. మొత్తం 20 రౌండ్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి లక్షా 2 వేల 74 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ కు 19 వేల 332 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి ఓబులేసుకు 4 వేల 897 ఓట్లు పోల్ కాగా.. నోటాకు 4 వేల 197 ఓట్లు వచ్చాయి.
మేకపాటి విక్రమ్ రెడ్డికి తొలి రౌండ్ లో 5 వేల 337 ఓట్ల లీడ్ వచ్చింది. నాలుగో రౌండ్ కు ఆధిక్యం 17 వేలకు పెరిగింది. ఆరవ రౌండ్ లో లీడ్ 30 వేలు దాటగా.. 10వ రౌండ్ ముగిసేసరికి 50 వేలు క్రాస్ అయింది. 17వ రౌండ్ లో విక్రమ్ రెడ్డి లీడ్ 70 వేలు దాటిపోయింది. 20 రౌండ్ల లెక్కింపు జరగగా చివరకు మేకపాటి విక్రమ్ రెడ్డి 82 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ వైసీపీకి భారీ ఆధిక్యం లభించింది. మొత్తం 217 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ కాగా.. 205 ఓట్లు చెల్లాయి. అందులో వైసీపీకి 167, బీజేపీకి 21 వచ్చాయి. విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించడంతో వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉంది. చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పోటీ చేస్తే పోటీ చేయకూడదనే గత సాంప్రదాయాన్ని అనుసరించి పోటీకి దూరంగా ఉన్నారని టీడీపీ ప్రకటించింది. జనసేన కూడా అదే నిర్ణయం తీసుకుంది. బీజేపీ మాత్రం బరిలోకి దిగింది. ఆత్మకూరులో లక్ష మెజార్టీతో విజయం సాధిస్తామని వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే మెజార్టీ 82 వేల దగ్గరే ఆగిపోయింది. పోలింగ్ శాతం తగ్గడం వల్లే లక్ష మెజార్టీ సాధించలేకపోయామని వైసీపీ నేతలు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఆత్మకూరులో 80 శాతానికి పైగా పోలింగ్ జరగగా.. ఉప ఎన్నికలో మాత్రం కేవలం 64 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది.
Read also: Target Kuppam: కుప్పం వైసీపీ బరిలో టాప్ హీరో.. చంద్రబాబు టార్గెట్ గా జగన్ స్కెచ్?
Read also: RGV - Draupadi Murumu: వివాదాస్పద ట్వీట్ చేసి డిలీట్ చేసిన వర్మ.. మళ్లీ పొగుడుతూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.