TRS Cadre Set Fire to YSRTP Chief Sharmila Bus: వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం వైయస్ షర్మిల తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వైయస్ షర్మిల ఉమ్మడి వరంగల్ జిల్లా లింగగిరి గ్రామంలో ప్రస్తుతం పాదయాత్రలో ఉండగా పాదయాత్ర చేస్తూ ఉండగా షర్మిల రెస్ట్ తీసుకునే బస్సుపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కిరోసిన్ పోసి బస్సును కాల్చే ప్రయత్నం చేసినట్లుగా చెబుతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకాలో ఈ లింగగిరి గ్రామం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే బస్సు తగలబెట్టే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గకుండా షర్మిల పాదయాత్ర చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో షర్మిల గో బ్యాక్ అంటూ టిఆర్ఎస్ కార్యకర్తలు సైతం నినాదాలు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది.  ఇక ఈ అంశం మీద వైయస్ షర్మిల మీడియాతో మాట్లాడారు, ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ కీలక నేతలు ఈ దురాగతానికి పాల్పడ్డారని ఆమె విమర్శించారు. పోలీసులు ప్రస్తుతానికి వారిని అదుపులోకి తీసుకున్నారు కానీ వారిని అరెస్టు చేశారా? అరెస్టు చేస్తే మీడియా ముందు ప్రవేశపెట్టండి అని ఆమె డిమాండ్ చేశారు.


ఇక ఈ పని వెనుక ఎమ్మెల్యే అనుచరులు నేరుగా ఎంపీపీ కూడా ఉన్నారని దానికి సంబంధించిన వీడియో ప్రూఫ్ కూడా ఉందని అయితే వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ముందా అని ఆమె పోలీసులను ప్రశ్నించారు. అసలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాదయాత్ర సాగుతున్న నేపథ్యంలో ఏవో ఇబ్బందులు ఉన్నాయని కావాలని ఇబ్బందులు సృష్టించేందుకు ఇలా చేస్తున్నారు ఆమె మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పేందుకు ఇలాంటి పరిస్థితులు, భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆమె విమర్శించారు.


గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ కోసం పాదయాత్ర చేసిన షర్మిల ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకున్నారు.తెలంగాణలో ఎలా అయినా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో ఆమె వైయస్సార్ తెలంగాణ కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించారు. ప్రస్తుతానికి ఒకపక్క టిఆర్ఎస్ మరొక పక్క బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు ఉండగా షర్మిల కూడా తాను బరిలోకి దిగుతున్నానని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపడుతున్నారు. ఇప్పటికే చాలా జిల్లాలు కవర్ చేసిన ఆమె ప్రస్తుతం వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక ఈ వ్యవహారం మీద మరింత సమాచారం అయితే అందాల్సి ఉంది.


Also Read: Bandi Sanjay: బండి సంజయ్‌కు ఊరట.. పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్


Also Read: Yadadri Thermal Power Plant: నేడు దామరచర్లకు సీఎం కేసీఆర్.. యాదాద్రి థర్మల్ పనుల పురోగతిపై పరిశీలన!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook