TRS Kanduva on lord Vinayaka: వినాయకుడి మెడలో టీఆర్ఎస్ కండువా వివాదాస్పదం
వినాయకుడి మెడలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పడం వివాదం రేపింది. ఎన్నికలకు ముందు నామినేషన్ వేయడానికంటే ముందుగా నామినేషన్ పత్రాలు గుడిలో దేవుడి ముందు పెట్టి తీసుకెళ్లడం చాలా సందర్భాల్లో చూస్తుంటాం.
హైదరాబాద్: వినాయకుడి మెడలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పడం వివాదం రేపింది. ఎన్నికలకు ముందు నామినేషన్ వేయడానికంటే ముందుగా నామినేషన్ పత్రాలు గుడిలో దేవుడి ముందు లేదా దేవుడి కాళ్ల దగ్గర పెట్టి తీసుకెళ్లడం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా వినాయకుడి మెడలోనే టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పడం వివాదాస్పదమైంది. పార్టీ అధికారంలో ఉంది కదా అని ఏకంగా దేవుడి మెడలో కూడా పార్టీ కండువాలు కప్పుతారా అంటూ హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ ( TRS MLA Muta Gopal ) మరదలు ముఠా పద్మా నరేష్ గాంధీనగర్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో నామినేషన్ వేయడం కోసం సిద్ధమైన ముఠా కుటుంబసభ్యులు.. అంతకంటే ముందుగా గాంధీనగర్‌లోని లక్ష్మీగణపతి టెంపుల్‌లో ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ క్రమంలోనే వినాయకుడి మెడలో టీఆర్ఎస్ పార్టీ కండువా ( TRS kanduva on Ganesh idol ) కప్పి పూజలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ( TRS MLC Kavitha ) కూడా అక్కడే ఉండటంతో ఈ వివాదంలో ఆమె పేరు కూడా చర్చనియాంశమైంది.
Also read : GHMC Elections: బీజేపి అభ్యర్థుల సెకండ్ లిస్ట్ బీజేపి ఇదే... ఇప్పటివరకు టీఆర్ఎస్ విడుదల చేసిన మొత్తం అభ్యర్థుల జాబితా
Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి