నిజామాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి ఎప ఎన్నికల్లో (Nizamabad Local Body MLC bypoll) టీఆర్ఎస్ అభ్యర్థి కె.కవిత భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారని తెలంగాణ రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సమన్వయంతో పనిచేసి కవిత (K Kavitha) విజయానికి అందరూ కృషిచేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. కవిత విజయం ఖాయమేనని, అయితే భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు.  



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. అక్టోబర్ 9న ఈ జరగనుందని, అప్పటివరకే ఓటర్లకు ఎన్నిక జరిగే తీరును వివరించి అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. ప్రాధాన్యత క్రమంలో సాగే ఓటింగ్‌పై ఓటర్లకు వివరించాల్సిన అవసరాన్ని నేతలు గుర్తుంచుకుని ఓటర్లకు అవగాహన పెంచాలన్నారు. 



ఈ సమావేశంలో మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ అభ్యర్థి కవితతో పాటు తెలంగాణ ప్రభుత్వ విప్ గంప గోవర్దన్, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, హన్మంత్ షిండే, ఆశన్నగారి జీవన్ రెడ్డి, బాబిరెడ్డి గోవర్ధన్, సురేందర్, డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. కవిత విజయానికి కృషిచేస్తామని నాయకులు తెలిపారు. కాగా, ఏప్రిల్‌లో జరిగిన ఈ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. 


IPL చరిత్రలోనే అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డ్.. మళ్లీ రాజస్థానే  


 


ఇవి కూడా చదవండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe