తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇదివరకే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడి చికిత్స తర్వాత కోలుకున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు కరోనా (Jajala Surender Tested COVID19 Positive) సోకింది. ఇప్పటివరకూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే సురేందర్ సహా నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ తెలింది. Amit Shah: ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన హోంమంత్రి అమిత్ షా


కరోనా బారిన పడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సురేందర్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. పలు కార్యక్రమాలలో పాల్గొంటున్న కారణంగా ప్రజా ప్రతినిధులు కోవిడ్19 మహమ్మారి బారిన పడుతున్నారు. ఎమ్మెల్యే సురేందర్ సైతం ఇటీవల కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం. Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా!
 Depression: ఈ యోగాసనాలతో డిప్రెషన్ పరార్!