Munugode Bypoll: ఓట్ల కోసం కోటి తిప్పలు.. యాదాద్రిలో మునుగోడు ఓటర్లకు స్పెషల్ దర్శనం
Munugode Bypoll: చౌటుప్పల్ మండలం దండు మల్కాపుర్ గ్రామానికి టీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్నారు ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తన గ్రామంలో పార్టీ అభ్యర్థికి లీడ్ తెచ్చేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే మల్కాపూర్ ఓటర్లను యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయానికి తీసుకెళ్లారు
Munugode Bypoll: ఎన్నికలు వచ్చాయంటే పార్టీలకు ఓటర్లే దేవుళ్లు. ఓటర్ల ప్రాపకం కోసం ఎంతవరకైనా వెళతారు. ఇప్పుడు మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. ఉప ఎన్నికలో గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రధాన పార్టీల నేతలంతా మునుగోడులోనే ఉన్నారు. ఒక్క ఓటర్ ని కూడా వదిలిపెట్టకుండా ప్రచారం చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న మునుగోడు ఓటర్లను సైతం రప్పిస్తున్నారు. ఓటర్లకు భారీగా తాయిలాలు ఆఫర్ చేస్తున్నారు. ఏమైనా చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదంలో చిక్కారు.
చౌటుప్పల్ మండలం దండు మల్కాపుర్ గ్రామానికి టీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్నారు ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తన గ్రామంలో పార్టీ అభ్యర్థికి లీడ్ తెచ్చేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే మల్కాపూర్ ఓటర్లను యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయానికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. స్వామివారి ఆరగింపు సేవను నిలిపివేయించి మరీ ఓటర్లకు స్వామివారి స్పెషల్ దర్శనం చేయించారు. మల్కాపూర్ నుంచి 15 బస్సులలో ఓటర్లను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి యాదగిరిగుట్టకు తీసుకువెళ్లారు. ఓటర్లు వెళుతున్న బస్సులకు ఎస్కార్ట్ గా కారు కూడా వెళ్లింది. మల్కాపూర్ ఓటర్లు వెళ్లిన బస్సులను అధికారులు నేరుగా కొండపైకి అనుమతించారు. మల్కాపూర్ ఓటర్లు కొండపైకి వెళ్లేసరికి మధ్యాహ్నం 12 దాటింది. ఆ సమయంలో స్వామివారికి ఆరగింపు సేవ జరగాల్సి ఉంది. కాని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూచనలతో అధికారులు ఆరగింపు సేవను నిలిపివేశారు. దండు మల్కాపురం ఓటర్లకు టుంబసమేతంగా లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేయించారు. అందరికీ 150 రూపాయల స్పెషల్ దర్శనాన్ని చేయించారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.
ఓటర్లను ప్రత్యేక బస్సుల్లో యాదగిరిగుట్టకు తీసుకువెళ్లడమే కాకుండా ఏకంగా స్వామివారి సేవలు నిలిపివేసి మరీ దర్శనం చేయించడం వివాదాస్పదమవుతోంది. ఆలయ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.దండు మల్కాపురం గ్రామస్తులకు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం అనంతరం నలభై మేకలు కోసి మరీ విందు ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే జీవన్ రెడ్డే తమని గుట్టకు తీసుకువచ్చారని గ్రామస్థులు చెప్పారు. మునుగోడు ఉపఎన్నిక రావడంతో స్వామివారిని చక్కగా దర్శనం చేసుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు.
Read Also: Munugode Bypoll: మునుగోడు రిటర్నింగ్ అధికారి అవుట్.. పోలింగ్ వరకు ఇంకెన్ని ట్విస్టులో!
Read Also: Budida Bikshamaiah Goud: బీజేపికి భిక్షమయ్య గౌడ్ గుడ్ బై.. పార్టీపై సంచలన ఆరోపణలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook