జనగాం: జనగాం జిల్లా కేంద్రానికి సమీపంలోని యశ్వంతపూర్‌లో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఊహించనిరీతిలో చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి శంకుస్థాపన కార్యక్రమం పక్కనపెట్టి అక్కడి గ్రామ మాజీ సర్పంచ్‌కి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆపేసి అక్కడే నేలపై పడుకుని నిరసనకు దిగారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి వచ్చిన ఎమ్మెల్యేనే స్వయంగా నిరసనకు దిగడంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక పార్టీ కార్యకర్తలు, స్థానికులు అయోమయానికి గురయ్యారు. అది కూడా సొంత పార్టీకి చెందిన మహిళా నాయకురాలు, సాధారణ మాజీ సర్పంచ్‌పై ఎమ్మెల్యే నిరసనకు దిగడం వారిని మరింత అయోమయానికి గురిచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నిరసనకు దిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. జనగాం పట్టణం నుంచి వెలువడే మురికి నీటిని యశ్వంతపూర్ వాగులోకి మళ్లించేందుకు జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గతంలో ప్రాజెక్టు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే, జనగాం మున్సిపాలిటీ నుంచి వచ్చిన మురికి నీరు తమ వాగులో కలిస్తే.. వాగులో నీరు కలుషితం అవుతుందని అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ అదే యశ్వంతపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సుశీలమ్మ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఆ ప్రాజెక్టుపై స్టే తెచ్చినట్టు తెలుస్తోంది.


ఇదిలావుంటే, తాజాగా అదే యశ్వంతపూర్ గ్రామంలో అభివృద్ధిపనుల శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. తమ ప్రాజెక్టు ప్రణాళికలకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిని మహిళను అక్కడికి పిలిపించుకున్నారు. ఆమె తన నిర్ణయాన్ని మార్చుకునే వరకు తాను అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించబోనంటూ అక్కడే నేలపై పడుకుని నిరసన వ్యక్తంచేశారు. సుశీలమ్మ తన పిటిషన్ ఉపసంహరించుకుంటానని చెబితేనే తాను అభివృద్ధిపనుల శంకుస్థాపన చేస్తానని ఎమ్మెల్యే పంతం పట్టుకుని మరి నేలపై పడుకుని నిరసన తెలిపారు.


Also read : Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డిపై అట్రాసిటీ కేసు


ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ( Jongaon MLA Muthireddy Yadagiri Reddy ) తీరుపై స్పందించిన మాజీ సర్పంచ్ సుశీలమ్మ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. గ్రామ ప్రయోజనాల కోసమే తాను కోర్టుకు వెళ్లానని, ఇందులో తన సొంత ప్రయోజనాలు ఏవీ లేవని సుశీలమ్మ కూడా అంతే గట్టేగా తెగేసి చెప్పారు. అంతేకాకుండా యశ్వంతపూర్ గ్రామ ప్రయోజనాలను పణంగాపెడుతూ జనగాం మునిసిపాలిటీ ( Jongaon municipality ) మురికి నీటిని ఇలా వాగులో కలుపుతామని ఎమ్మెల్యే నిర్ణయం తీసుకోవడం కూడా సబబు కాదని సుశీలమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి అర్థమయ్యేలా నచ్చచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన ఆమె మాటలను వినిపించుకోలేదు.


Also read : Properties Registration: తొలిరోజే రూ.85 లక్షల ఆదాయం.. నేడు, రేపు సెలవులు రద్దు


Also read : Kavitha Kalvakuntla: డ్రైవర్ వివాహానికి హాజరైన ఎమ్మెల్సీ కవిత..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook