Nandakumar Hotel Demolition: తెలంగాణలోనూ యూపీ సీన్ రిపీటైంది. యోగీ సర్కార్ అమలు చేస్తున్న బుల్డోజర్ రూల్ ను హైదరాబాద్‌లోనూ అమలు చేసింది కేసీఆర్ సర్కార్. ఫిలింనగర్‌లోని  నందకుమార్ అలియాస్ నందుకు చెందిన హోటల్ డెక్కన్ కిచెన్‌ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. తెలంగాణలో ప్రకంపనలు రేపిన ఎమ్మెల్యేల బేరసారాల కేసులో నందు  నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఫాంహౌజ్ డీల్ లో కీలకంగా ఉన్న నందకుమార్ హోటల్‌లోని కొన్ని నిర్మాణాలను అక్రమ కట్టడాల పేరుతో బల్దియా అధికారులు తొలగించడం కలకలం రేపుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినీ నిర్మాత దగ్గుపాటి సురేశ్ బాబుకు చెందిన స్థలాన్ని  లీజు తీసుకున్నారు నందకుమార్. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా  దక్కన్ కిచెన్ ప్రాంగణంలో రెండు అక్రమ నిర్మాణాలు చేపట్టారని జీహెచ్ఎంసీ అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు ఇచ్చినా పనులు ఆపకుండా కొనసాగిస్తుండంతో కూల్చివేత చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. కూల్చివేతల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


మరోవైపు ఎమ్మెల్యేల బేరసారాల కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. ఏపీ, హర్యానా, కేరళ, కర్ణాటకతోపాటు హైదరాబాద్‌లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. సిట్ అధికారులు ఏడు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. హర్యానాలోని నిందితుడు రామచంద్ర భారతి నివాసంతోపాటు కర్ణాటకలోని అతడికి సంబంధించిన ఇంటిలోనూ సోదాలు చేపట్టారు. తిరుపతిలో సింహయాజికి చెందిన ఆశ్రమంలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో మరో నిందితుడు నందుకు చెందిన ఇళ్లు, హోటళ్లలో ముమ్మరం సోదాలు చేస్తున్నారు సిట్ అధికారులు. 


అదేవిధంగా కేరళలో ఓ వైద్యుడి ఇంట్లోనూ తనిఖీలు సాగుతున్నాయి. నిందితుడు రామచంద్ర భారతికి వైద్యుడు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఓ జాతీయ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి బంధువు ఇందులో ఉన్నట్లు తేల్చారు. సింహయాజీ .. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు అతడు విమానం టికెట్ బుక్ చేసినట్లు విచారణలో సిట్ అధికారులు గుర్తించారు. ఎమ్మెల్యేల బేరసారాల కేసులో మరిన్ని అరెస్ట్‌లు ఉండే అవకాశం కనిపిస్తోంది.


Also Read: Delhi MCD Elections: టికెట్ దక్కలేదని టవర్ ఎక్కిన ఆప్‌ నాయకుడు.. వినూత్న నిరసన   


Also Read: Dil Raju Varisu : వారసుడు ఎఫెక్ట్.. కర్మ ఈజ్ బూమరంగ్.. దిల్ రాజు మెడకు చుట్టుకునేలా వివాదం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి