Sankranthi 2023 Movies : దిల్ రాజు చేసే వ్యాపారం, ఆయన లెక్కలన్నీ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆయన నిర్మాతగా ఉంటే ఒక లెక్కలా ఉంటుంది.. అదే డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఒక లెక్క ఉంటుంది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా నైజాం ఏరియాను తన గుప్పిట్లో పెట్టేసుకున్నాడు దిల్ రాజు. అయితే దిల్ రాజు మాటలు ఒక్కో సందర్భంలో ఒక్కోలా ఉంటాయి. ఏ సినిమాలైనా కూడా తను చెప్పినట్టుగానే విడుదలవ్వాలనే అభిప్రాయంలో దిల్ రాజు ఉంటాడేమో అన్నట్టుగా కనిపిస్తుంటుంది. కార్తికేయ 2 సమయంలో దిల్ రాజు మీద ఎంత పెద్ద చర్చలు జరిగాయో అందరికీ తెలిసిందే.
ఇక దిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్న దళపతి విజయ్ వారసుడు సినిమా ఇప్పుడు వివాదంగా మారేట్టు కనిపిస్తోంది. టాలీవుడ్‌లో షూటింగ్‌లు బంద్ అయిన సమయంలో వారిసు షూటింగ్ జరిగింది. అదేంటని అంతా అడిగితే.. అది తెలుగు సినిమా కాదు అని సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. వంశీ పైడిపల్లి కూడా ఇది పక్కా తమిళ సినిమానేఅని చెప్పేశాడు. అలాంటి తమిళ సినిమాకు నైజాం ఏరియాలో భారీ ఎత్తున థియేటర్లు కేటాయించాలని దిల్ రాజు భావించాడట.
karma is a boomerang antey ento anukunna ra..clarity vachesindi @DilRajuOfficial
— Shiva prasaD🕷 (@shivainn) November 13, 2022
అసలే సంక్రాంతి రేసులో చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి ఉన్నాయి. ప్రభాస్ ఆదిపురుష్ పక్కకి వెళ్లిపోయింది. దిల్ రాజు మాత్రం తన వారిసు సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు రెడీగా ఉన్నాడు. కానీ ఇదే దిల్ రాజు 2019లో రజినీకాంత్ పేట్ట సినిమాను డబ్బింగ్ చిత్రం అని, అలాంటప్పుడు ఎక్కువ థియేటర్లు ఎలా ఇస్తామంటూ ప్రశ్నించాడు. తన ఎఫ్ 2, మిగిలిన తెలుగు చిత్రాలకు భారీ ఎత్తున థియేటర్లు ఇప్పించుకున్నాడు.
కానీ అదే దిల్ రాజు ఇప్పుడు డబ్బింగ్ చిత్రమైన వారిసుకు ఎలా థియేటర్లు అన్నీ కేటాయిస్తారంటూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రశ్నించింది. దీంతో కర్మ ఈజ్ బూమరంగ్ అంటే ఇదేనేమో అని జనాలు కౌంటర్లు వేస్తున్నారు. మరి ఈ వివాదం మీద దిల్ రాజు స్పందిస్తాడా? లేదా? అన్నది చూడాలి.
Also Read : Shock to Dil Raju: దిల్ రాజుకు షాకిచ్చిన తెలుగు నిర్మాతల మండలి.. దెబ్బ అదుర్స్ కదూ!
Also Read : Yashoda Overseas Collections : రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. సమంత యశోద జోరు మామూలుగా లేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook