MLC Kavitha Comments: 8 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలనపై మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీపై విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. 8 ఏళ్ల పాలనలో ఏం చేశారని విమర్శలు సంధిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. 8  ఏళ్ల పాలనపై 8 ప్రశ్నలు సంధించారు. వీటికి ప్రధాని మోదీ, బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళా శక్తికి సమాన ప్రాధాన్యత ఇస్తామన్నారు ఏమైయ్యిందని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఎక్కడ ఉంది మోదీ జీ అంటూ ప్రశ్న సంధించారు. జీడీపీ పడిపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని..గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు రెట్టింపు అవుతున్నా వాటిపై దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు. అమితంగా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ప్రభుత్వ పక్షపాతానికి ముగింపు ఎప్పుడని..తెలంగాణకు రావాల్సిన రూ.7 వేల కోట్ల పెండింగ్ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. దేశంలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరిందని..ప్రధాని మోదీ ప్రకటించిన అచ్చే దిన్‌ ఎప్పుడు వస్తుందన్నారు. 8 ఏళ్ల పాలనలో వ్యవస్థ నిర్వహణలో విఫలమైయ్యారని..అమృత్‌ కాల్ ఎప్పుడు వస్తుందని మండిపడ్డారు.


తెలంగాణలోని వరి, పసుపు రైతుల కష్టాలను ఎప్పుడు తీర్చుతారని టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. న్యూ ఇండియా యొక్క వాస్తవికత ఏంటో ప్రధాని మోదీ చెప్పాలన్నారు. దేశంలో కోట్లాదిమంది ప్రజలు కనీస ఆదాయం పొందలేకపోతున్నారని చెప్పారు. దేశ ప్రజలకు నిధుల గురించి నిజమైన సమాచారం తెలిసే రోజు వస్తుందా మోదీ అని ఎమ్మెల్సీ కవిత 8 ప్రశ్నలు సంధించారు.


Also read: Sidhu Moose Wala Murder: సింగర్ సిద్ధూ హత్యపై సీఎం దిగ్భ్రాంతి... హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశాలు... 


Also read:CM JAGAN@3: జగన్ పాలనకు మూడేళ్లు.. మూడు మాటల్లో వర్ణించిన నారా లోకేష్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook