Patnam Mahender Reddy: పట్నం మహేందర్‌ రెడ్డి ఈ పేరు విననిపొలిటిషన్స్‌ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఉండరంటే అతిశయోక్తికాదు. మాజీమంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పాలిటిక్స్‌లో తన మార్క్ పట్నం మహేందర్‌ రెడ్డి ప్రదర్శించారు. ప్రస్తుతం ఆయన  ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిపై  దుర్భాషలు ఆడియో టేపులు బయటపడటంతో అధికార పార్టీ రాజకీయాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. అయితే తాండూరులోని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి తన అనుచరులతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తనకు అడ్డుగా కూర్చున్నారనే అంశంపై సీఐ రాజేందర్ రెడ్డికి మహేందర్ రెడ్డి ఫోన్ చేసి దుర్భాషలాడడంతో వివాదానికి దారితీసింది. ఎమ్మెల్యే పక్కన రౌడీలు కూర్చుంటే ఏం పీకుతున్నావని సీఐ రాజేందర్‌పై ఫైర్‌ అయ్యారు. ఎమ్మెల్సీ దుర్భాషలాడుతున్నా..సర్ మర్యాదగా మాట్లాడండని సీఐ అన్నా పట్నం ఏ మాత్రం వినలేదు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక చేసేది ఏమీలేక తాండూరు సీఐ తనపై దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆచీతూచీ ప్రవర్తిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు తదుపరి చర్యలు తీసుకునే వరకు ఓపికగా ఉండాలంటూ సీఐకి సూచించారు. అయితే మహేందర్ రెడ్డి ఆడియో వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇప్పుడు అందరి నోట ఒకటే మాట... మహేందరా ఏందీ నీ బూతుపురాణం తక్షణమే సీఐకి క్షమాపణ చెప్పాలని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఓయూ జేఏసీ నేతలు కూడా స్పందించారు.  ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని ఒళ్లు దగ్గర పెట్టుకుని మర్యాదగా సీఐకి క్షమాపన చెప్పాలని వార్నింగ్ ఇచ్చారు.



మరోవైపు సీఐ రాజేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు తాండూరు పోలీసులు ఐపీసీ 353, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అటు తనపై కేసు నమోదైన సంగతి తెలియదని ఎమ్మెల్సీ పట్నం స్పష్టం చేశారు. తను సీఐని తిట్టలేదని, ఆ ఆడియో తనది కాదని, కొందరు రాజకీయ ప్రత్యర్ధులు ఆడుతున్న డ్రామా అంటూ పట్నం కొట్టిపారేశారు. సీఐపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని, అవసరమైతే హైకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తానంటూ మహేందర్ రెడ్డి తెలిపారు. అటు తాండూరు ఎమ్మెల్యే సైతం పట్నం తీరుపై స్పందించారు. తొలి నుంచి టీఆర్ఎస్ పార్టీతోనే తన రాజకీయం ప్రయాణం మొదలైందని, సీటుకోసం వచ్చిన మహేందర్ రెడ్డి తనపై, తన అనుచురులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపించారని, తనవెంట ఉన్నవారిని రౌడీలని సంబోంధించడం దిగజారుడు తనానికి నిదర్శమని ఆరోపించారు. ఈ అంశంపై ఇంతవరకు గులాబీ బాస్ స్పందించలేదు.  మహేందర్ రెడ్డి ఆడియో వ్యవహారం మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.


Also Read: Komatireddy Venkat Reddy: మా అడ్డాలోకి వేరే నేత అక్కర్లేదు.. రేవంత్ నల్గొండ టూర్‌పై కోమటిరెడ్డి సంచలన కామెంట్స్


Also Read:  10th Paper Leak: ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కలకలం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.