Nagarjuna sagar Bypoll: తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి లోక్‌సభతో పాటు నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుంది. చివరి నిమిషంలో నోముల నర్శింహయ్య కుమారుడు నోముల భగత్‌కే టీఆర్ఎస్ టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలోని నాగార్జునసాగర్ (Nagarjuna sagar ) టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (Nomula Narsimhaiah) అకాల మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉపఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధిగా జానారెడ్డి ( Janareddy)ని ఇప్పటికే ప్రకటించింది. అటు బీజేపీ ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు. టీఆర్ఎస్ (TRS) అభ్యర్ధిగా ఎవరిని రంగంలో దించుతారనేది సస్పెన్స్ కొనసాగింది. అసంతృప్తి లేకుండా చేసేందుకు ఈసారి టీఆర్ఎస్ చివరి నిమిషం వరకూ వేచి చూసి అభ్యర్ధిని ప్రకటించింది. చివరికి దివంగత ఎమ్మెల్యే నోముల నర్శింహయ్య కుమారుడైన నోముల భగత్ ‌(Nomula Bhagat)కే బీఫారం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది పార్టీ అధిష్టానం. రేపు ఉదయం అంటే మార్చ్ 30వ తేదీన నోముల భగత్ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ కూడా మార్చ్ 30వ తేదీనే కావడం విశేషం. 


నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్శింహయ్య డిసెంబర్ నెలలో మృతి చెందడంతో ఉప ఎన్నిక (Nagarjuna sagar Bypoll) నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 17 వతేదీన ఉపఎన్నిక కాగా, మార్చ్ 30 వరకూ నామినేషన్లకు గడువుంది. మార్చ్ 31వ తేదీ నామినేషన్ పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 3వ తేదీ వరకూ నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. మే 2వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.


Also read: COVID-19 Positive Cases: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు, Holi సమయంలో బీ కేర్‌ఫుల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook