Nagarjuna sagar Bypoll: తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉపఎన్నికల కోసం టీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. ఆపరేషన్ నాగార్జునసాగర్ ప్రారంభించింది. ప్రచార వ్యూహాన్ని ఖరారు చేస్తున్నారు గులాబీ నేతలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దుబ్బాక ఉపఎన్నికల్లో(Dubbaka Bypoll) ఎదురైన చేదు అనుభవం దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్(TRS) పగడ్బందీ వ్యూహ రచన చేస్తోంది. నాగార్జునసాగర్ (Nagarjuna sagar)చేజారిపోకుండా, పార్టీ అభ్యర్ధి నోముల భగత్ విజయం కోసం ఆపరేషన్ నాగార్జునసాగర్ ప్రారంభించింది. ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తూ..మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను నియోజకవర్గంలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది పార్టీ అధిష్టానం. ప్రచారం ముగియడానికి ఒకరోజు ముందు అంటే ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రెండ్రోజులపాటు నియోజకవర్గంలోనే ఉండేలా వ్యూహం సిద్ధం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌తో రోడ్ షో సిద్దం చేస్తున్నారు.రోడ్ షో ఎక్కడెక్కడ, ఎప్పుడు నిర్వహించాలనేది ఇంకా ఖరారు కావల్సి ఉంది. 


మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Srinivas yadav) మాత్రం ఎన్నికలు ముగిసేవరకూ నియోజకవర్గంలోనే ఉండాల్సి ఉంది. ఇప్పటికే ఆయన నియోజకవర్గానికి చేరుకుని స్థానిక నేతలతో చర్చించారు. సాగర్ అభ్యర్ధిత్వంపై ఆశలు పెట్టుకున్న గురవయ్య యాదవ్, రంజిత్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్‌లను కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి బుజ్జగించారు. భగత్‌కు టికెట్ ఎందుకివ్వాల్సివచ్చిందనేది వివరించారు. పార్టీ ప్రజా ప్రతినిధులంతా నియోజకవర్గంలో పర్యటించి భగత్ ( Nagarjuna sagar candidate Bhagat) గెలుపు కోసం పని చేయాలని  తెలంగాణ భవన్ ఆదేశాలు జారీ చేసింది. 


Also read: COVID-19 Positive Cases: తెలంగాణలో కరోనా విజృంభణ, నిన్న ఒక్కరోజే 684 కోవిడ్-19 పాజిటివ్ కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook