తెలంగాణలో మళ్లీ అధికారం టీఆర్ఎస్ దే
మళ్లీ టీఆర్ఎస్ కే పట్టం కట్టనున్న తెలంగాణ ప్రజలు
ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని.. ముందుగానే నమూనా సర్వే చేపట్టారు. అందుకోసం మూడు సంస్థలను ఎంచుకొని నివేదిక అందించాలని చెప్పారు. వారు 10లక్షల మందికి పైగా ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించారు. అయితే ఈ మూడు సర్వేల్లో రెండు సర్వేలు టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని.. వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని సమాచారం. మిగిలిన ఆ ఒక్క సర్వే ఇంకా రావాల్సి ఉంది.
మూడు సర్వేల్లో రెండు సర్వే నివేదికలు మొత్తం 119 సీట్లలో 100కు పైగా అసెంబ్లీ సీట్లను తెలంగాణ రాష్ట్ర సమితి కైవసం చేసుకుంటుందని వెల్లడించాయి.
ఈ రెండు సర్వేల్లో ఒకటి టీఆర్ఎస్‌కి 105 సీట్లు లభిస్తాయని, మరొకటి టీఆర్ఎస్‌కి 103 సీట్లు లభిస్తాయని నివేదికలు అందించాయి. ఆ మిగిలిన ఒక్క సర్వే రిపోర్టు వచ్చాక కేసీఆర్ మంత్రులు, ఇతర శాసనసభ్యులతో భేటీ ఏర్పాటు చేయనునున్నారు.
రెండు సర్వేలలో..ఒక సర్వే బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కదని వెల్లడించింది. ప్రస్తుతం బీజేపీకి ఐదుగురు ఎంఎల్ఎలు ఉన్నారు. మరో నివేదికలో బీజేపీకి హైదరాబాదులో ఒక సీటు వస్తుందని వెల్లడించింది.
వచ్చే ఎన్నికలలో 70 అసెంబ్లీ సీట్లను గెలిచి అధికారంలోకి వస్తామని ప్రధాన ప్రతిపక్ష పార్టీ, కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది. కానీ ఈ రెండు సర్వేలు వచ్చే ఎన్నికల్లో ఏడు నుంచి తొమ్మిది సీట్లు వస్తాయని చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు వచ్చాయి.