TS Assembly session: రెండు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతన సంస్కరణలు తీసుకొచ్చింది. కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తోంది. జీహెచ్ఎంసీ చట్టాల్లో సవరణలు, పలు అంశాలపై చర్చించేందుకు రెండు రోజులపాటు తెలంగాణ శాసనసభ సమావేశం (TS Assembly Session) కానుంది.
రెవెన్యూ విధానంలో అవినీతిని రూపుమాపి, పారదర్శతను తీసుకొచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) ఇటీవల నూతన సంస్కరణలు తీసుకొచ్చింది. కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తోంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC Elections) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్టోబర్ 12, 13 తేదీలలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని టీఆర్ఎస్ సర్కార్ యోచిస్తోంది.
- Also Read: Telangana: 1,200 దాటిన కరోనా మరణాలు
జీహెచ్ఎంసీ చట్టాల్లో సవరణలతో పాటు రాష్ట్ర హైకోర్టు సూచించిన అంశాల్లో పలు సవరణలు చేయాల్సిన నేపథ్యంలో శాసనసభ సమావేశం అవాలని భావిస్తోంది. దీనిపై శుక్రవారం (అక్టోబర్ 9న) నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ సీఎం కార్యాలయం తమ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది.
కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో నూతన రెవెన్యూ చట్టంతో పాటు పలు కీలకమైన బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. మరికొన్ని అంశాలపై సవరణల కోసం మరోసారి సమావేశం కానున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe