TS Budget 2022: రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​ రావు (Finance Minister Harish Rao) ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. రూ.2.56 లక్షల కోట్లుతో బడ్జెట్ (Ts Budget 2022)ను ప్రవేశపెట్టారు మంత్రి. వ్యవసాయం, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్​రూం, దళితబంధు వంటి వాటికి అధిక కేటాయింపులు చేశారు. రూ.16,144 కోట్ల పంట రుణాలను మాఫీ చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం లోపు  రూ.75 వేల లోపు సాగు రుణాలు మాఫీ  చేస్తామని పద్దులో పేర్కొన్నారు. మార్చిలోపు రూ.50 వేల లోపు రైతు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైతుబీమా తరహాలోనే చేనేత కుటుంబాలకు భరోసా కల్పించనుంది తెలంగాణ ప్రభుత్వం. నేతన్నలు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు బడ్జెట్ లో తెలిపారు. రైతు బంధు ప‌థ‌కం త‌ర‌హాలోనే చేనేత కార్మికుల (handloom workers) కోసం ప్ర‌త్యేక ప‌థ‌కాన్ని ఈ ఏడాది ప్రారంభించాల‌ని ప్రభుత్వం నిర్ణ‌యించిందని హారీశ్ రావు తెలిపారు. 


Also Read: Telangana Budget 2022: బడ్జెట్‌ ప్రవేశపెట్టిన హ‌రీశ్‌రావు.. రూ.2.56 ల‌క్ష‌ల కోట్ల‌తో బ‌డ్జెట్‌!!


ఈ ఏడాది దళిత బంధు పథకానికి (Dalit Bandhu Scheme) భారీగా కేటాయింపులు చేశారు. గతేడాది వెయ్యికోట్లు కేటాయించగా..ఈ సారి పద్దులో రూ. 17,700 కోట్లు కేటాయించారు. హుజురాబాద్‌ నియోజకవర్గంతో పాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్‌, చారగొండ మండలాల్లో ప్రభుత్వం ఇప్పటికే దళిత బంధు స్కీమ్ ను సంపూర్ణంగా అమలుచేస్తోందని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది చివరి నాటికి 2 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించినట్లు హరీశ్​రావు వెల్లడించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook