TS Budget 2022: తెలంగాణ బడ్జెట్​ రూ.2.56 లక్షల కోట్లు- హైలైట్స్ ఇవే..

TS Budget 2022: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంవత్సరానికి సంబంధించి బడ్జెట్​ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. వ్యవసాయం, దళితబంధు సహా వివిధ పథకాలకు బడ్జెట్​లో అధిక ప్రాధాన్యతనిచ్చింది. బడ్జెట్​ హైలైట్స్ ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2022, 01:32 PM IST
  • 2022-23 బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
  • వ్యవసాయం, దళితబంధు పథకాలకు అధిక ప్రాధాన్యత
  • అన్ని రంగాలను ప్రోత్సహించేలా కేటాయింపులు!
TS Budget 2022: తెలంగాణ బడ్జెట్​ రూ.2.56 లక్షల కోట్లు- హైలైట్స్ ఇవే..

TS Budget 2022: భారీ అంచనాల నడుమ వార్షిక బడ్జెట్​ను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. రూ.2.56 లక్షల కోట్లుతో ఆర్థిక మంత్రి హరీశ్​ రావు నేడు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. వ్యవసాయం, ఆసరా పెన్షన్​లు, డబుల్ బెడ్​రూం, దళితబంధు వంటి వాటికి భారీ కేటాయింపులతో పద్దు ప్రవేశపెట్టారు మంత్రి హరీశ్​ రావు.

బడ్జెట్ హైలైట్స్​..

గతంలో ఇచ్చిన హామీకి తగ్గట్లు దళిత బంధు పథకానికి భారీగా నిధులు పెంచింది ప్రభుత్వం. ఈ సారి బడ్జెట్​లో రూ.17,700 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు.

అత్యధికంగా వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఆసరా పెన్షన్​ పథకం కోసం రూ.11,728 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

  • కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్​కు రూ.2750 కోట్లు కేటాయింపు.
  • డబుల్ బెడ్రూమ్ ల కోసం రూ.12000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
  • ఎస్టీల సంక్షేమం కోసం రూ.12565 కోట్లు, బీసీ సంక్షేమం కోసం రూ.5698 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
  • మన ఊరు- మన బడికోసం రూ.7289 కోట్లు, పట్టణ ప్రగతి కోసం రూ.1394 కోట్లు, పల్లె ప్రగతికోసం రూ.3330 కోట్ల చొప్పున కేటాయింపులు చేసింది ప్రభుత్వం.
  • ఫారెస్ట్ యూనివర్సిటీ కోసం రూ.100 కోట్లు, హరితహారంకు రూ.932 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.
  • పట్టణ, గ్రామీణ ప్రాంతాల రోడ్లు, భవనాల అభివృద్ధికోసం కోసం రూ.1542 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్​ 2022లో ఉంది.
  • అర్బన్ మిషన్ భగీరథకు ఈసారి బడ్జెట్​లో రూ.800 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
  • మెట్రో అభివృద్ధికోసం ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేసింది. ఎయిర్​పోర్ట్​తో మెట్రో కనెక్టవిటీ కోసం రూ.500 కోట్లు, మొత్తం మెట్రో ప్రాజెక్టు కోసం మరో రూ.1,500  కోట్లు కేటాయించిస్తున్నట్లు తెలిపింది.
  • మెట్రోతో పాటు ఆర్టీసీని కూడా మరింత బలోపేతం చేసేందుకు బడ్జెట్​లో రూ.1,500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Also read: Telangana Budget Session: తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్.. సమావేశాలు ముగిసేంతవరకూ వేటు..

Also read: elangana Budget 2022: బడ్జెట్‌ ప్రవేశపెట్టిన హ‌రీశ్‌రావు.. రూ.2.56 ల‌క్ష‌ల కోట్ల‌తో బ‌డ్జెట్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News