TS Cabinet: ఎన్నికల సంఘం అనుమతితో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ధాన్యం కొనుగోలు, వర్షాకాలం, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం తదితర అంశాలపై కీలక చర్చ జరిగింది. దాదాపు 5 గంటల పాటు సచివాలయంలో ఈ సమావేశం జరగ్గా కొన్ని ప్రధాన అంశాలతోపాటు ఇతర అంశాలు కూడా చర్చలోకి వచ్చాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kavtiha: కల్వకుంట్ల కవితకు మళ్లీ నిరాశే! కానీ ఇక్కడే భారీ ట్విస్ట్‌.. ఏం జరిగిందంటే?


 


సమావేశం అనంతరం మంత్రివర్గ భేటీలో తీసుకున్న నిర్ణయాలను పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మీడియాకు వెల్లడించారు. 'జూన్‌ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించాం. ఈ వేడుకకు కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించనున్నాం. వచ్చే సీజన్‌ నుంచి సన్న వడ్లకు కనీస మద్దతు ధరపై రూ.500 బోనస్‌ ఇస్తాం. తడిసిన.. మొలకెత్తిన ధాన్యాన్ని రైతుల నుంచి కొనాలని నిర్ణయించాం. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించనున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. అథారిటీ సూచనల ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేస్తాం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ ఆదేశానుసారం పని చేస్తాం' అని పొంగులేటి తెలిపారు.

Also Read: Chepa Prasadam: ఆస్తమా, శ్వాసకోశ బాధితులకు శుభవార్త.. చేప ప్రసాదం పంపిణీ ఆ రోజే! 


- నాసిరకం విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు
- ఎన్నికల సంఘం ఆంక్షలు విధించడంతో కేవలం మంత్రివర్గ నిర్ణయాలు మాత్రమే మంత్రులు వెల్లడించారు.
- మాజీ సీఎం కేసీఆర్‌పై పరోక్షంగా విమర్శలు, ఆరోపణలు చేశారు.
- జూన్‌ 5వ తేదీన మాట్లాడుతామని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చెప్పారు. అంటే జూన్‌ 4 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను బట్టి మాట్లాడుతామని పరోక్షంగా తెలిపారు.
- ప్రస్తుతం పాఠశాలల పునఃప్రారంభం, అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల కొనుగోలుపై మంత్రివర్గంలో కీలక చర్చ జరిగింది.


మీడియా ప్రశ్నల వర్షం
కాగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. బోనస్‌ అనేది సన్న వడ్లకేనా? అని ప్రశ్నించగా పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సమాధానం చెప్పలేకపోయారు. దొడ్డు వడ్లకు బోనస్‌ ఇవ్వరనేది బీఆర్‌ఎస్‌ పార్టీ విమర్శలు చేస్తున్నదానిని గుర్తు చేయగా.. మంత్రి దాటవేశారు. ఇక రైతు భరోసా పేరు కింద రైతు బంధు రూ.15 వేలు హామీ ప్రశ్నించగా దీనికి కూడా మంత్రులు సరైన జవాబు చెప్పలేకపోయారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter