Jagga Reddy: సంగారెడ్డి ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి రెడ్డి పార్టీని విడతానని ప్రకటించగా.. ఆ పార్టీ నేతలు వరుసగా బుజ్గగింపులు ప్రారంభించారు. ఇవాళ మధ్యాహ్నం మరో సీనియర్​ నేత సహా పలువురు పార్టీ నేతలు కలిసి జగ్గా రెడ్డిని కలిసి పార్టీని వీడొద్దని ఆయనకు సూచించారు. పార్టీలో ఉండేలా ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తాజాగా మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి సహా సీనియర్ కాంగ్రెస్ నేత గీతా రెడ్డి.. జగ్గా రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు  చేశారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.. జగ్గారెడ్డిని వెంటపెట్టుకుని... ఉత్తమ్​ కుమార్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడ జగ్గారెడ్డికి పార్టీ వీడకుండా.. సంప్రదింపులు జరుపుతున్నారు పార్టీ నేతలు.


అంతర్గతంగా ఏవైనా సమస్యలు ఉంటే.. అదిష్ఠానం వద్ద మాట్లాడి పరిష్కరించుకుందామని అంతే గానీ పార్టీని మాత్రం వీడొద్దంటూ జగ్గా రెడ్డికి ఉత్తమ్​, గీతా రెడ్డీలు సూచించినట్లు తెలిసింది. మరి వరుస బుజ్జగింపులతో జగ్గా రెడ్డి మనసు మార్చుకుంటారో లేదా తన నిర్ణయాన్ని కొనసాగిస్తారో వేచి చూడాలి.


జగ్గా రెడ్డి పార్టీ వీడేందుకు చెప్పిన కారణాలు..


పార్టీలో కొందరికి తాను హైలైట్ అవ్వడం ఇష్టం లేదని అందుకే ఎవరికీ ఇబ్బందు ఉండకూడదని పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు జగ్గా రెడ్డి. తనపై రాహుల్ గాందీకి చెడుగా చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనికి తోడు ఇటీవల జరగిన అవమానాలు తనను కాంగ్రెస్​ పార్టీ వీడేందుకు ప్రేరేపించినట్లు వివరించారు.


కాంగ్రెస్​నూ వీడినప్పటికీ ఏ పార్టీలో చేరే ఆలోచన లేదని స్వతంత్రంగానే సేవ చేస్తానని కూడా జగ్గా రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ నుంచి బయటకు వచ్చినా ఎప్పటికీ.. సోనియా గాంధీ, రాహుల్​ గాంధీలను గౌరవిస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బాగుండాలని ఆకాంక్షించారు.


Also read: Jaggareddy: జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని బతిమాలిన కాంగ్రెస్ నేత.. పార్టీని వీడొద్దని విజ్ఞప్తి..


Also read: MLA Jaggareddy: కాంగ్రెస్‌కు బిగ్ షాక్... పార్టీని వీడనున్న జగ్గారెడ్డి.. ఇవాళ అధికారిక ప్రకటన?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook