తెలంగాణ ఎంసెట్ -2018 హాల్‌ టికెట్లు శనివారం విడుదలయ్యాయి. రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్‌తో పాటు పుట్టిన తేదీ వివరాలతో హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  హాల్‌ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌‌లో ఉంచారు. అభ్యర్థులు మే1, 2018 వరకు డౌన్‌లోడ్ చేసుకొనే అవకాశం కల్పించారు. అభ్యర్థులు ఎవరైతే ఇంకా ఎంట్రెన్స్ టెస్టుకు ఫీజు కట్టలేదో.. వారు రూ.5000 లేట్ ఫైన్‌తో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ఎంసెట్ 2018 పరీక్షలు మే 2న మొదలై మే 7 వరకు జరుగుతాయి. మెడికల్, అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు మే 2, 3 తేదీల్లో, ఇంజినీరింగ్ విద్యార్థులకు 4, 5, 7 తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు http://eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను లాగిన్ కావాలి.


టీ ఎంసెట్ హాల్‌ టికెట్/అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?


* అభ్యర్థి అధికారిక తెలంగాణ ఎంసెట్ 2018(http://eamcet.tsche.ac.in) వెబ్‌సైట్‌ కు వెళ్లండి.


* హోంపేజీలో తెలంగాణ ఎంసెట్ 2018 హాల్‌టికెట్ లింక్ పై క్లిక్ చేయండి.


* మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి గెట్ హాల్‌టికెట్ బటన్ నొక్కండి. 


* ఆతరువాత మీ హాల్‌టికెట్/అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.