TS EdCET 2020 Results: టీఎస్ ఎడ్‌సెట్ 2020 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
Telangana EdCET 2020 Results | తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్- 2020 ఫలితాలు (TS EdCET 2020 Results) నేడు (అక్టోబర్ 28) విడుదలయ్యాయి. టీఎస్ ఎడ్‌సెట్ - 2020 ఫలితాలు (TS EdCET Result 2020)ను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి బుధవారం విడుదల చేశారు.
బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్- 2020 ఫలితాలు (TS EdCET 2020 Results) నేడు (అక్టోబర్ 28) విడుదలయ్యాయి. అక్టోబర్ 1, 3వ తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహించింది. టీఎస్ ఎడ్‌సెట్ - 2020 ఫలితాలు (TS EdCET Result 2020)ను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి విడుదల చేశారు. నేటి ఉదయం 11:30 గంటలకు ఓయూ క్యాంపస్ ఆవరణలోని యునివర్సిటీ కాలేజీ ఆఫ్ ఎడ్యూకేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఫలితాలు వెల్లడించారు. Also Read : ECIL Jobs 2020: ఈసీఐఎల్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
TS EdCET 2020 Results link 1 : తెలంగాణ ఎడ్‌సెట్ 2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి
తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు (TS EdCET-2020 Results) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని ప్రొ. పాపిరెడ్డి తెలిపారు. ఎడ్‌సెట్ రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను https://edcet.tsche.ac.in/TSEDCET/TSEDCET_Rank2020Cardgkt.aspx వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని సూచించారు. వాస్తవానికి తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఫలితాలను అక్టోబర్ 21న విడుదల చేయాల్సి ఉంది, అయితే భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అక్టోబర్ 28కి వాయిదా వేశారు. అధికారిక వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి
TS EdCET Result 2020 link : తెలంగాణ ఎడ్‌సెట్ 2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి
తెలంగాణ ఎడ్‌సెట్ 2020 పరీక్షకు 30,600 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో ర్యాంకులు సాధించిన వారు రెండేళ్ల కాలవ్యవధి గల బీఈడీ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. బీఈడీ అర్హత కలిగి ఉన్న వారు ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లుగా ఉద్యోగాలు చేసేందుకు అర్హలుగా భావిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe