Bank Jobs 2020: యూకో బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

UCO Bank Jobs 2020 | బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభావార్త. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న అతిపెద్ద బ్యాంక్ యూకో బ్యాంకు పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. నేటి (అక్టోబర్ 27) నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు (uco bank Job opportunities) ప్రారంభమయ్యాయి. ఛార్టెర్డ్ అకౌంటెంట్స్, ఐటీ ఆఫీసర్ సహా మొత్తం 91 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 

Last Updated : Oct 27, 2020, 03:01 PM IST
  • బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభావార్త
  • యూకో బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
  • నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి
Bank Jobs 2020: యూకో బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

UCO Bank Recruitment 2020:  బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న అతిపెద్ద బ్యాంక్ యూకో బ్యాంకు  (UCO Bank Jobs 2020)పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ మేరకు పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. 

 

రాత పరీక్ష, అందులో ఎంపికైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి పోస్టులను భర్తీ చేయనున్నారు. తగిన అర్హతలతో పాటు ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పలు కేటగిరీలలో మొత్తం 91 పోస్టులను స్కేల్ 1, స్కేల్ 2 విభాగాలుగా భర్తీ చేస్తున్నారు.  Also Read : SBI Clerk Mains Hall Ticket 2020: ఎస్‌బీఐ ‘క్లర్క్’ మెయిన్స్ హాల్‌ టికెట్లు విడుదల

 

మొత్తం 91 పోస్టుల వివరాలు..

  • ఛార్టెర్డ్ అకౌంటెంట్స్/ సీఎఫ్‌ఏ: 50
  • ఐటీ ఆఫీస‌ర్: 20
  • సెక్యూరిటీ ఆఫీస‌ర్స్: 09
  • ఇంజినీర్స్: 08
  • ఎక‌ననామిస్ట్‌: 02
  • స్టాటిస్టీసియన్: 02

దరఖాస్తు చేసుకునేందుకు క్లిక్ చేయండి

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 27
  • ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు తుది గడువు: నవంబర్ 17
  • రాతపరీక్ష: డిసెంబరు 2020 లేక జనవరి 2021లో ఉంటుంది.

యూకో బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ (UCO Official Website)
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News