తెలంగాణ నూతన అధునాత సచివాలయ ( Telangana New Secretariat )నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి ప్రభుత్వం 4 వందల కోట్ల రూపాయల్ని మంజూరు చేయడమే కాకుండా..టెండర్ నోటిఫికేషన్లకు రంగం సిద్ధం చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తెలంగాణలోని 132 ఏళ్ల చరిత్ర ఉన్న పాత సెక్రటేరియన్ భవనాన్ని( Demolished the old secretariat building in telangana ) కూల్చివేశారు. కోర్డు అడ్డంకుల్ని అధిగమించి కూల్చివేతను పూర్తి చేశారు. ఇప్పుడిక కొత్త హంగులతో అధునాతనమైన సెక్రటేరియట్ భవన నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉంది. కొత్త సెక్రటేరియట్ భవనం కోసం ప్రభుత్వం తాజాగా 4 వందల కోట్ల రూపాయల్నిమంజూరు చేసింది. దీనికోసం ఆర్ అండ్ బీ శాఖ నుంచి పరిపాలనాపరమైన అనుమతులు జారీ కానున్నాయి. అంతేకాకుండా ఒకట్రెండు రోజుల్లోనే టెండర్ల ప్రక్రియకు నోటిఫికేషన్ వెలువడనుంది. కొత్త భవన నిర్మాణం కోసం రాష్ట్ర కేబినెట్ ( Ts Cabinet ) ఆమోదం తెలిపిన నేపధ్యంలో చెన్నై ఆర్కిటెక్ట్ ఆస్కార్, పొన్నిలతో తెలంగాణ అధికారులు భేటీ అయ్యారు. 


కొత్త సచివాలయంలో అన్ని సౌకర్యాలూ ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ( Cm kcr ) ఆదేశించారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి, కార్యదర్శులు, సలహాదార్ల ఛాంబర్లు అన్ని సౌకర్యాలతో ఉండాలని సూచించారు. ప్రతి అంతస్థులో డైనింగ్ హాలు, మీటింగ్ హాలు, వెయిటింగ్ హాలు ఉండాలని..వాహనాలన్నింటికీ పార్కింగ్ ఉండాలని కేసీఆర్ తెలిపారు. Also read: TRS ఎమ్మెల్యే మరణంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి