తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఐసెట్‌ 2020 (TS ICET 2020)ను నేడు (సెప్టెంబర్ 30న) నిర్వహిస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ఐసెట్ 2020కు మొత్తం 58,452 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షను ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అయితే అక్టోబర్ 1న ఉద‌యం మాత్రమే ప‌రీక్ష జరుగుతుంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 కోవిడ్ (COVID19) నిబంధనలు పాటిస్తూ తెలంగాణ ఐసెట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఐసెట్ క‌న్వీన‌ర్ రాజిరెడ్డి వెల్లడించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. భౌతిక దూరం పాటించేలా పరీక్షా కేంద్రాల వద్ద చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం జూలై 13న ఐసెట్ ప‌రీక్ష జ‌ర‌గాల్సి ఉండగా, కరోనా నేపథ్యంలో ఇతర ప్రవేశ పరీక్షల తరహాలోనే తెలంగాణ ఐసెట్ 2020 వాయిదా పడింది.



 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe