Telangana Inter Results 2022: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఫలితాలు ఉదయం 11 గంటలకు వెల్లడవుతాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంటర్ విద్యార్థులు https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https://examresults.ts.nic.in వెబ్‌సైట్లలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోవాలి :


1) మొదట https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https://examresults.ts.nic.in వెబ్‌సైట్లలో ఏదేని వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
2) హోమ్ పేజీలో 'ఇంటర్ ఫలితాలు' ఆప్షన్‌పై క్లిక్ చేయండి
3) ఇప్పుడు మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి
4) అంతే.. స్క్రీన్‌పై మీ ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి
5) ఫలితాల కాపీని ప్రింటవుట్ తీసి ఉంచుకోండి.


ఈ ఏడాది మే 6 నుంచి మే 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 1443 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. ఇందులో 4,64,626 మంది ఫస్టియర్‌ విద్యార్థులు కాగా.. 4,42,767 మంది సెకండియర్ విద్యార్థులు. వీరంతా ప్రస్తుతం ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఫలితాల విడుదల నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దని నిపుణులు సూచిస్తున్నారు. మానసిక ఒత్తిడికి గురైనా, ఇతర సమస్యలేవైనా ఉన్నా ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నంబర్‌ 18005999333 సంప్రదించాలి. తద్వారా విద్యార్థులకు తగిన సలహాలు, సూచనలు లభిస్తాయి. ఇంటర్ ఫలితాలు విడుదలైన 15 రోజుల్లోనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.



Also Read: Maharashtra Political Crisis: రెండుసార్లు రాజీనామాకు సిద్ధపడి వెనక్కి తగ్గిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. ఆయన వల్లే..


Also Read: Horoscope Today June 28th: నేటి రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది..  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.