TS inter results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈ రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. ఒక వేళ మొదటి, రెండవ సంవత్సరపు ఇంటర్మీడియట్ ఫలితాల (Telangana Inter Results 2022) రిలీజ్ చేసినట్లయితే స్టూడెంట్స్ అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.inలో రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. అధికారిక సైట్ తో పాటు results.cgg.gov.inలో మార్కుల వివరాలను అందుబాటులో ఉంచున్నారు. మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్ అవ్వకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జాబితా సిద్ధమయ్యాకే రిజల్ట్స్ అనౌన్స్ చేయాలని భావిస్తున్నారు.
టీఎస్ ఇంటర్ ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఇంటర్ పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4.80 లక్షల మంది మెుదటి ఏడాది పరీక్షలు రాశారు. అదే సంఖ్యలో సెకండియర్ స్డూడెంట్స్ కూడా ఎగ్జామ్స్ రాశారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఇంటర్ పరీక్షలు నిర్వహించలేదు. పరీక్షలు లేకుండానే విద్యార్థులను ఉత్తీర్ణులను చేసింది కేసీఆర్ సర్కారు. ఇంటర్ పరీక్షలు మే 6 నుండి 24, 2022 వరకు ఆఫ్‌లైన్ మోడ్‌లో జరిగాయి. ఈ రోజే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.
Also Read: Telangana: తెలంగాణలో త్వరలో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డు, మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.