TS Inter Supplementary Exams Date: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫలితాల్లో ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండియర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 9,28,262 మంది పరీక్షలు రాయగా.. ఫస్టియర్‌లో 2,94,378 మంది, సెకండియర్‌లో 4,63,370 మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులను ఆదేశించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సప్లిమెంటరీ పరీక్షల కోసం జూన్ 30 నుంచి పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇవాళ వెలువడిన ఫలితాల్లో తమకు వచ్చిన మార్కులతో సంతృప్తి చెందనివారు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు చివరి నాటికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేస్తారు. పరీక్షల్లో ఫెయిలైనవారు సప్లిమెంటరీ ఫీజు చెల్లించి పరీక్షలు రాయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు తెలిపారు.


తాజాగా వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.ఫస్టియర్‌లో 72.33 శాతం బాలికలు, సెకండియర్‌లో 75.86 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌లో బాలురు 54.26 శాతం, సెకండియర్‌లో 59.21 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్లియర్‌లో 75 శాతంతో, సెకండియర్‌లో 78 శాతంతో మేడ్చల్ జిల్లా ఇంటర్ ఫలితాల్లో టాప్‌లో నిలిచింది. ఫస్టియర్‌లో 40, సెకండియర్‌లో 47 శాతంతో ఇంటర్ ఫలితాల్లో మెదక్ చివరి స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా 63.32 శాతం, సెకండియర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది.



Also Read: Hyderabad Job Mela : రేపే హైదరాబాద్ లో భారీ జాబ్ మేళా.. నిరుద్యోగులు మిస్ చేసుకోకండి.. ఇదే గోల్డెన్ ఛాన్స్ 


Also Read: Flipkart Offer: రూ. 8 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 699కే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.