Inter Student Death in Nizamabad: విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్న తెలంగాణలో ఇంటర్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. రిజల్ట్స్ వచ్చేయడంతో పాస్ అయిన విద్యార్థులు ఆనందంతో ఉండగా.. మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు కాస్త నిరాశకు గురవుతున్నారు. ఇక ఫెయిల్ అయిన విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు. ఫలితాలు విడుదలైన కాసేపటికే.. ఓ విద్యార్థి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫస్టియర్‌లో ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉరి వేసుకుని.. దారుణ నిర్ణయం తీసుకున్నాడు. పూర్తి వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రి నగర్‌లో లక్ష్మణ్ ఆర్ఎంపీగా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు ప్రజ్వల్ హైదరాబాద్‌ మాదాపూర్‌లోని నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ బైపీసీ చదువుతున్నాడు. మంగళవారం ఫలితాలు విడుదలవ్వగా.. ప్రజ్వల్ ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్థాపానికి గురైన ప్రజ్వల్.. ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తండ్రి లక్ష్మణ్‌ కొడుకు నంబరుకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. అనంతరం తల్లిదండ్రులు ఇంటికి వెళ్లి చూడగా.. ప్రజ్వల్ విగతజీవిగా కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు తెలిసింది. ప్రజ్వల్ మృతితో శాస్త్రి నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీమున్నీరుగా విలపిస్తున్నారు. 


కాగా.. నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలవ్వగా.. ఫస్టియర్‌లో 63.85 శాతం, సెకండియర్‌లో 67.26 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. గతేడాది కంటే ఈసారి ఇంటర్ ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లాకు మొదటిస్థానంలో నిలవగా.. సెంకడియర్ ఫలితాల్లో ములుగు జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో మెదక్ జిల్లా చివరిస్థానంలో నిలిచింది.


జూన్ 4వ తేదీ నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందొద్దని ఆమె కోరారు. మళ్లీ బాగా చదివి సప్లిమెంటరీ పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని పిల్లలను ఇబ్బంది పెట్టవద్దని తల్లిదండ్రులను కోరారు. ఈ నెల 16 వరకు ఫీజు కట్టేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ రోజు సాయంత్రం నుంచి కలర్ మెమోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.


Also Read: TS Inter Results 2023: ఇంటర్ ఫలితాలు, మార్కుల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Also Read: Tatkal Ticket Rules: తత్కాల్‌ కోటా వెయిటింగ్‌ లిస్టులో ఉంటే డబ్బులు వస్తాయా..? పూర్తి వివరాలు ఇలా..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి