KTR TRAGET RAHUL: కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్.. ఓ రేంజ్ లో తిట్టుకున్నారుగా?
KTR TRAGET RAHUL: రాహుల్ గాంధీపై ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. అమేథీలో సొంత లోక్ సభ సీటును కూడా గెలవలేని అంతర్జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అంటూ సెటైర్ వేశారు.
KTR TRAGET RAHUL: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఉత్సాహంగా కొనసాగుతోంది. రాహుల్ యాత్రతో తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. పాదయాత్రలో భాగంగా సోమవారం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. టీఆర్ఎస్ తో పాటు సీఎం కేసీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో దోపిడి పాలన సాగుతుందని... టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనన్నారు రాహుల్ గాంధీ. కేసీఆర్ అంతర్జాతీయ స్థాయిలో పార్టీ పెట్టినా తమకు నష్టం లేదంటూ బీఆర్ఎస్ పార్టీపై సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.
రాహుల్ గాంధీపై ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. అమేథీలో సొంత లోక్ సభ సీటును కూడా గెలవలేని అంతర్జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అంటూ సెటైర్ వేశారు. సీఎం కేసీఆర్ తలపెట్టిన బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ జాతీయ పార్టీ ఆశయాలను అపహస్యం చేస్తున్నారని విమర్శించారు. దేశ ప్రధానిగా కావాలని కలలుగంటున్న రాహుల్.. ముందుగా ప్రజలచే ఎంపీగా ఎన్నుకునేలా ఒప్పించాలి అంటూ ట్విట్ చేశారు కేటీఆర్.
రాహుల్ గాంధీపై కేటీఆర్ ఇచ్చిన కౌంటర్ పై స్పందించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కన్న కూతురునే ఎంపీగా గెలిపించుకోలేని…మీరు డబ్బా కొట్టుకున్న ‘జాతీయ’ నాయకుడి రాజకీయ జీవితం ఓటమితోనే మొదలయ్యిందన్న సంగతి గుర్తుందా…!? ఎవరన్నా గుర్తు చేయండ్రా బాబూ…!? అంటూ ట్వీట్ చేశారు.
Also Read: Minister KTR: సీఎం జగన్ నా బెస్ట్ ఫ్రెండ్.. ఏపీ మూడు రాజధానులపై మంత్రి కేటీఆర్ రియాక్షన్ ఇదే..!
Also Read: Bigg Boss Faima : ఫైమాకు మూడింది.. వెటకారం మరీ ఎక్కువైంది.. ఈ వారం బయటకు వచ్చేస్తుందోచ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి