Telangana TET Results 2022 to be released on July 1st: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) 2022 ఫలితాల విడుదలపై రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం కీలక ప్రకటన చేసింది. జులై 1న విడుదల చేస్తామని వెల్లడించింది. ఫలితాల్లో జాప్యానికి ఆస్కారం లేకుండా టెట్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈరోజు తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2022 విడుదల అయిన విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందుగా విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా జూన్ 27వ తేదీన 2022 టెట్‌ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. దీనిపై ఆదివారం రాత్రి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. నేడు టెట్‌ ఫలితాల విడుదలపై విద్యాశాఖ పూర్తి క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌ పేపర్‌-1కు 3,18,506 మంది, పేపర్‌-2కు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 


మంగళవారం తన కార్యాలయంలో విద్యా శాఖ పని తీరును మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి సమీక్షించారు. ఫ‌లితాల వెల్ల‌డిలో జాప్యానికి ఆస్కారం లేకుండా జులై 1న విడుద‌ల చేయాల‌ని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ సంచాలకులు దేవసేన, ఎస్‌ఈఆర్‌టీ డైరెక్టర్‌ రాధారెడ్డి, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 


Also Read: IND vs IRE Playing XI: రుతురాజ్‌ ఔట్.. రాహుల్‌ ఇన్! భారత్, ఐర్లాండ్‌ డ్రీమ్ ఎలెవన్ టీమ్ ఇదే


Also Read: Flipkart Offer: రూ. 8 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 699కే!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.