TSPSC Group 1 Notification: గ్రూప్-1 పోస్టుల దరఖాస్తులకు టీఎస్‌పీఎస్సీ గడువును పొడగించింది. షెడ్యూల్ ప్రకారం మే 31వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు. అయితే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు జూన్ 4 వరకు దరఖాస్తుల స్వీకరణను పొడగించింది. మొత్తం 503 గ్రూప్ 1 పోస్టులకు ఇప్పటివరకూ 3 లక్షల పైచిలుకు మంది దరఖాస్తు చేసుకున్నారు. చివరి రెండు రోజుల్లోనే దాదాపు 60 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా టీఎస్‌పీఎస్సీ గడువు పొడగించడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవగా.. మే 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జూలై చివరి వారంలో లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశాలున్నాయి. అయితే పరీక్షకు మరికొంత గడువు ఇస్తే బాగుంటుందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. జూలై, ఆగస్టులో ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో.. ఆ తర్వాతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించాలని కోరుతున్నారు. అభ్యర్థుల విజ్ఞప్తిని టీఎస్‌పీఎస్సీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వచ్చిన తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ కావడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. దాదాపు ఏడేళ్లుగా నిరుద్యోగ అభ్యర్థులు గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. గ్రూప్ 1తో పాటు ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉన్న మొత్తం 89 వేల ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ క్రమంలో ఇప్పటికే గ్రూప్ 1, పోలీస్ కానిస్టేబుల్ తదితర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి. త్వరలోనే మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. 


Also Read: Horoscope Today June 1st 2022: నేటి రాశి ఫలాలు.. గ్రహాల ప్రతికూలతతో ఆ రాశి వారికి అనుకోని కలహాలు...


Also Read: Krishnakumar Kannath: ప్రముఖ సింగర్ కృష్ణకుమార్ కన్నత్ హఠాన్మరణం... విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook