60 మంది విద్యార్థులతో పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
పెద్దపల్లి జిల్లాలో బుధవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ముత్తారం మండలం ఖమ్మంపల్లి-అడవి శ్రీరాంపూర్ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది.
పెద్దపల్లి: జిల్లాలో బుధవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ముత్తారం మండలం ఖమ్మంపల్లి-అడవి శ్రీరాంపూర్ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులతో పాటు మరో 10 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు, ప్రయాణికులు స్వల్ప గాయాలయ్యాయి. మంథని నుంచి ముత్తారం మండలంలోని పలు గ్రామాల విద్యార్థులను తీసుకుని దర్యాపూర్‌లోని మోడల్ స్కూల్‌కి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
Read also : స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి!
బస్సు ప్రమాదంబారిన పడిందని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఏమైందో ఏమోననే ఆందోళనతో హుటాహటిన ఘటనస్థలానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు తిరగపడతారేమోననే భయంతో బస్సును అక్కడే వదిలి డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. తాత్కాలిక డ్రైవర్లు నడిపిస్తున్న బస్సులు తరచుగా ప్రమాదాలబారిన పడుతున్న తీరు తమను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.