అర్ధరాత్రి వేళ సజ్జనార్‌కు యువతి ట్వీట్... వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ..
VC Sajjanar quick response to woman`s mid night tweet: పాలె నిషా అనే ఓ యువతి మంగళవారం(జనవరి 11) అర్ధరాత్రి సమయంలో వీసీ సజ్జనార్‌ను ట్యాగ్ చేస్తూ ఓ విజ్ఞప్తి చేయగా.. దానికి ఆయన వెంటనే స్పందించారు.
VC Sajjanar quick response to woman's mid night tweet: టీఎస్ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టాక కొత్త సంస్కరణలతో ముందుకు దూసుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ప్రయాణికుల నుంచి వచ్చే వినతులు, విజ్ఞప్తులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. తాజాగా అర్ధరాత్రి వేళ ఓ యువతి చేసిన ట్వీట్‌కు సజ్జనార్ వెంటనే స్పందించడం విశేషం.
పాలె నిషా అనే ఆ యువతి మంగళవారం(జనవరి 11) అర్ధరాత్రి సమయంలో వీసీ సజ్జనార్‌ను ట్యాగ్ చేస్తూ ఓ విజ్ఞప్తి చేశారు. 'మహిళలు రాత్రి వేళల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు... ఒక 10 నిమిషాలు పెట్రోల్ బంకుల వద్ద ఆపితే వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి కూడా ఎటువంటి భారం ఉండదు.' అని ఆమె పేర్కొన్నారు. ఇలా పెట్రోల్ బంకుల వద్ద ఆపడం ద్వారా రాత్రిపూట దూర ప్రయాణాలు చేసే మహిళలు వాష్ రూమ్ వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుందనేది ఆమె ఉద్దేశం. ఈ ట్వీట్‌పై వీసీ సజ్జనార్ వెంటనే స్పందించారు. ఇప్పటికే ఆ మేరకు టీఎస్ఆర్టీసీ అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. సజ్జనార్ స్పందనపై ఆ యువతి హర్షం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టాక సజ్జనార్ (VC Sajjanar) తనదైన మార్క్‌తో దూసుకెళ్తున్నారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో ఇంటి వద్దకే బస్సులను పంపించే ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి పండగకు సొంతూళ్లకు వెళ్లేవారు.. ఒకే ప్రాంతంలో 30 మంది వరకు ఉన్నట్లయితే... వారి కాలనీకే బస్సులు పంపిస్తున్నారు. ఇందుకోసం హెల్ప్ లైన్ నంబర్లలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సాధారణంగా పండగల సమయంలో ప్రతీసారి ఆర్టీసీ బాదుడు ఉండేది. కానీ ఈసారి ఎలాంటి బాదుడు లేకుండానే సజ్జనార్ స్పెషల్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో సజ్జనార్ చర్యలపై ప్రయాణికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
Also Read: Pushpa Craze: కేరళ ఆలయంలో మారుమోగిన పుష్ప సాంగ్.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook