Pushpa Craze: కేరళ ఆలయంలో మారుమోగిన పుష్ప సాంగ్.. వీడియో వైరల్

Pushpa 'Sami Sami' song played in temple: ఇటీవల కేరళలోని ఓ దేవాలయంలో అక్కడి నాదస్వర బృందం పుష్ప సినిమాలోని 'సామి.. సామి...' పాటను ఆలపించింది. ఆలయ పూజారి పూజలు చేస్తుండగా నాదస్వర బృందం ఈ పాటను ఆలపించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2022, 12:02 PM IST
  • కేరళ ఆలయంలో పుష్ప మూవీ సాంగ్
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
  • ట్విట్టర్‌లో షేర్ చేసిన దేవి శ్రీ ప్రసాద్
Pushpa Craze: కేరళ ఆలయంలో మారుమోగిన పుష్ప సాంగ్.. వీడియో వైరల్

Pushpa 'Sami Sami' song played in temple: ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. చంద్రబోస్ లిరిక్స్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌తో పుష్ప సాంగ్స్ సూపర్ హిట్‌గా నిలిచాయి. సినిమా విడుదలై దాదాపు నెల రోజులు కావొస్తున్నా... ఇప్పటికీ ఎక్కడ విన్నా అవే పాటలు మారుమోగిపోతున్నాయి. పెళ్లిళ్లు, ఈవెంట్స్‌లలో లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్స్ కామనే అయినప్పటికీ.. ఆలయాల్లోనూ పుష్ప పాటలు మారుమోగుతుండటం విశేషమనే చెప్పాలి.

ఇటీవల కేరళలోని ఓ దేవాలయంలో అక్కడి నాదస్వర బృందం పుష్ప సినిమాలోని 'సామి.. సామి...' పాటను ఆలపించింది. ఆలయ పూజారి పూజలు చేస్తుండగా నాదస్వర బృందం ఈ పాటను ఆలపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దిగ్విజయ అనే కన్నడ ఛానెల్‌ దాన్ని ప్రసారం చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

'వావ్.. కేరళలో అక్కడి మలయాళీలు ఆలపించిన తెలుగు సాంగ్ సామి సామి గురించి ఒక కన్నడ ఛానల్ చెబుతోంది.. బాంబే నుంచి ఎవరో దాన్ని నాకు ఫార్వర్డ్ చేస్తే... నేను చెన్నైలో కూర్చొని ఆ సాంగ్ వింటున్నాను... ఇది పర్ఫెక్ట్ పాన్ ఇండియా న్యూస్...' అంటూ దేవి శ్రీ ప్రసాద్ పేర్కొన్నారు.

 

కాగా, పుష్ప మూవీలో థర్డ్ సింగిల్‌గా గతేడాది అక్టోబర్‌లో 'సామి సామి' సాంగ్‌ యూట్యూబ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పాటకు చంద్రబోస్ అందించిన లిరిక్స్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీ అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఈ సాంగ్ లిరికల్ వీడియోకి యూట్యూబ్‌లో ఇప్పటివరకూ 63 మిలియన్ల వ్యూస్ రాగా... ఇటీవల విడుదలైన వీడియో సాంగ్‌కి (Viral Video) 8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

Also Read: Raghurama Krishna Raju: ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇంటికి సీఐడీ పోలీసులు.. ఏం జరగబోతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News