TSRTC MD VC Sajjanar suggests don't travel in crowded car or autos Use RTC Bus : టీఎస్ ఆర్టీసీ ఎండీగా (TSRTC MD) సజ్జనార్‌ (Sajjanar) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా మార్పులు వస్తున్నాయి. ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా పలు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అలాగే సోషల్‌ మీడియాలో (Social media) కూడా టీఎస్‌ ఆర్టీసీకి (RTC) మంచి హైప్ ఇస్తున్నారు సజ్జనార్‌. (VC Sajjanar) రెగ్యులర్‌‌గా ట్విట్టర్‌‌లో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌లు చేస్తుంటారు ఈ టీఎస్ ఆర్టీసీ బాస్. (RTC boss)


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు పోస్ట్‌ చేసిన ఒక ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కాప్షన్ ఇచ్చారు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. (TSRTC MD VC Sajjanar) సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు (CYBERABAD TRAFFIC POLICE) వారు "కిక్కిరిసిన కార్లు, ఆటోలలో ప్రయాణించకండి. సురక్షితంగా ఇంటికి చేరండి." అంటూ ఒక డేంజర్‌‌ ట్రావెల్‌ ఫోటోతో ట్వీట్‌ పోస్ట్ చేశారు. 



అయితే టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ (VC Sajjanar) అదే పోస్ట్‌ను రీట్వీట్‌ చేస్తూ.. "కిక్కిరిసిన కార్లు, ఆటోలలో ప్రయాణించకండి. మీ సురక్షిత ప్రయాణం కోసం టీఎస్ ఆర్టీసీ బస్‌ని ఎంచుకోండి" అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ (Post) ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజెన్స్ (Netizens) కూడా ఈ పోస్ట్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ (Comments) చేస్తున్నారు.



 


Also Read : Jagadish Reddy Corona: తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి కరోనా పాజిటివ్


ఇక టీఎస్‌ ఆర్టీసీ తాజాగా ఒక కొత్త సదుపాయాన్ని కూడా తీసుకొచ్చింది. ప్రయాణికుల ఇంటి వద్దకే సేవలు అందించేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్ధమైంది. సంక్రాంతికి (Sankranti) ఊరు వెళ్లే ప్రయాణికులు ఒకే ప్రాంతంలో 30 మంది ఉంటే, వారి ప్రాంతానికి ఆర్టీసీ బస్సును పంపిస్తామంది టీఎస్ఆర్టీసీ. (TSRTC) ఒక్క ఫోన్ చేస్తే చాలు బస్ (Bus) మీ ప్రాంతానికి వస్తుందని ఆర్టీసీ తెలిపింది. ఇందుకోసం ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉండే ప్రయాణికులకు ఈ సదుపాయం కల్పించారు.  సమాచారం కోసం ఎంజీబీఎస్.. 9959226257, జేబీఎస్.. 9959226246, రేతిఫైల్ బస్ స్టేషన్ .. 9959226154, కోఠి బస్ స్టేషన్.. 9959226160 నంబర్లలో సంప్రదించాలని టీఎస్ ఆర్టీసీ (TSRTC) సూచించింది.


Also Read : Corona Third Wave: తెలంగాణలో సంక్రాంతి సెలవుల పొడిగింపుపై నిర్ణయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook