TSRTC : తెలంగాణలో ఆర్టీసీ చార్జిల పెంపుకు ప్రతిపాదనలివే... ప్రజలపై ఎంత భారమంటే...
ఆర్టీసీ టికెట్ చార్జీల పెంపునకు టీఎస్ఆర్టీసీ అధికారులు నాలుగు ప్రతిపాదనలు సిద్దం చేసి ప్రభుత్వానికి సమర్పించారు.ఆ పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
TSRTC Proposals to CM kcr to Hike Bus Ticket Fares: తెలంగాణలో ఆర్టీసీ(TSRTC) చార్జీల పెంపుకు రంగం సిద్ధమవుతోంది.చార్జీల పెంపుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు.. దాన్ని ప్రభుత్వానికి సమర్పించారు.మొత్తం నాలుగు ప్రతిపాదనలు సిద్దం చేశారు.కి.మీకి 15 పైసలు మొదలు 30 పైసల వరకు పెంచితే ప్రభుత్వానికి ఎంత ఆదాయం సమకూరుతుందనేది లెక్కలతో సహా వివరించారు.
కి.మీకి 20 పైసలు చొప్పున పెంచితే రూ.625కోట్లు,25 పైసలు చొప్పున పెంచితే దాదాపు రూ.750 కోట్లు, 30 పైసలు పెంచితే రూ.900 కోట్లు మేర ఆదాయం పెరుగుతుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.కి.మీకి 25 పైసలు చొప్పున పెంచే ప్రతిపాదనకు ఆర్టీసీ(TSRTC) అధికారులు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. 30 పైసలైతే ప్రజలు అధిక భారంగా భావించే అవకాశం ఉందని... 25 పైసలైతే ప్రజలు కూడా సానుకూలంగా ఉంటారని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: Sierra Leone: సియారా లియోన్‌లో ఘోర దుర్ఘటన..ఆయిల్ ట్యాంకర్ పేలి 91 మంది మృతి!
పెరిగిన డీజిల్(Diesel) ధరలతో ఆర్టీసీ చార్జీల పెంపు అనివార్యమని ప్రభుత్వం భావిస్తోంది. గత నెలలో సీఎం కేసీఆర్(CM KCR) ఆర్టీసీ అధికారులతో సమావేశమైన సందర్భంగా ధరల పెంపు గురించి అధికారులు ప్రస్తావించారు.డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో చార్జీలు పెంచాలని సీఎంను కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎం.. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.తాజాగా ప్రతిపాదనలు సీఎం కార్యాలయానికి చేరడంతో త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
చివరిసారిగా తెలంగాణ(Telangana) ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఆర్టీసీ చార్జీలు పెంచింది.ఆ సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.68 ఉండగా... 20 పైసల మేర పెంచింది.దీంతో ప్రజలపై ఏటా రూ.550 కోట్లు భారం పడింది.ఈ రెండేళ్లలో పెట్రోల్,డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం ఆర్టీసీకి రాయితీ కింద ఇచ్చే లీటర్ డీజిల్ ధర రూ.90కి చేరువగా ఉంది. ఇప్పుడున్న చార్జీలతోనే ఆర్టీసీని నిర్వహిస్తే మరింత నష్టం తప్పదని సంస్థ అధికారులు,ప్రభుత్వం భావిస్తోంది.ఈ నేపథ్యంలోనే చార్జీల పెంపుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.పెంపుకు ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉండటంతో రేపో మాపో చార్జిల బాదుడు తప్పకపోవచ్చు.
Also Read: Edible Oil Price Reduced: దేశంలో భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు.. లీటరుకు రూ.5 నుంచి రూ.20 తగ్గింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook