TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. జీతంలో ఆ భాగం కోత..
TSRTC HRA Cut:తెలంగాణ ప్రభుత్వం ఆర్‌టీసీ ఉద్యోగులపై షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవలె 21 శాతం ఫిట్మెంట్ తో అధికారిక ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. భాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో 2023-24 ఉత్తమ ఉద్యోగులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు
TSRTC HRA Cut:తెలంగాణ ప్రభుత్వం ఆర్‌టీసీ ఉద్యోగులపై షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవలె 21 శాతం ఫిట్మెంట్ తో అధికారిక ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. భాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో 2023-24 ఉత్తమ ఉద్యోగులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీ కోసం వినతి పత్రం సమర్పించారు ఆ సమయంలో మంత్రి వారికి హామీ ఇచ్చారు ఆ తర్వాతి రెండు రోజుల్లోనే ప్రభుత్వం పీఆర్సీసీ పెంచేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. 21 శాతం ఫిట్మెంట్ పెంచుతూ టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 51 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు లబ్ది పొందనున్నారు.
అయితే, తాజాగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇది ఆర్టీసీ ఉద్యోగులకు షాకింగ్ విషయమే. ఆర్టీసీ ప్రభుత్వం పెంచిన వేతనాల్లో హెచ్‌ఆర్ఏలో కోత విధించింది. ఈ నిర్ణయంతో జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేసే ఆర్టీసీ ఉద్యోగులకు నష్టం వాటిల్లనుంది. ఇప్పటి వరకు 30 శాతం ఉన్న హెచ్ఆర్ఏను 24 శాతానికే పరిమితం చేసింది. ఇతర జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులకు 13-11 శాతం వరకు తగ్గించింది.
ఇదీ చదవండి: పదోతరగతి బోర్డుపరీక్షలు రాసే విద్యార్థులు.. మీ డైట్ ఇలా ఉంటే ఏకాగ్రత పెరుగుతుంది..
జూన్ 1 వ తేదీ నుంచి పెరిగిన ఫిట్మెంట్ అమల్లోకి వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గత శనివారం బస్ భవన్లో మీడియాతో జరిగిన సమావేశంలో తెలిపారు. 2017 లో నాటి ప్రభుత్వం పీఆర్సీ ఇచ్చిందని మళ్లీ తమ ప్రభుత్వం ఆర్టీసీలో నాలుగేళ్లకు ఒకసారి ఈ పీఆర్సీపెంచే విధానం ఉంది. ఏటా టీస్‌ఆర్టీసపై అదనంగా రూ. 418 కోట్లు భారం పడనుంది(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
ఇదీ చదవండి: మీ చర్మం పొడిబారుతుందా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook