19న తెలంగాణ బంద్.. కార్మికుల భవిష్యత్ కార్యాచరణ
19న తెలంగాణ బంద్.. కార్మికుల భవిష్యత్ కార్యాచరణ
హైదరాబాద్: న్యాయబద్దమైన తమ డిమాండ్లను పరిష్కరించి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు తాము సమ్మె విరమించే ప్రసక్తే లేదని తెలంగాణ ఆర్టీసి కార్మిక సంఘాల జేఏసి నేతలు స్పష్టంచేశారు. టిఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం ఎనిమిదో రోజుకు చేరుకుంది. అయితే, సమ్మెపై ప్రభుత్వం రోజుకింత కఠిన వైఖరి అవలంభిస్తుండటంతో సమ్మెను మరింత ఉధృతం చేసైనా ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలని టిఎస్ఆర్టీసి కార్మిక సంఘాలు ఆలోచిస్తున్నాయి. అందులో భాగంగానే శనివారం ఆర్టీసి కార్మిక సంఘాలు తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాయి.
ఈ నెల 19న ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష పార్టీలు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా వంటా వార్పు కార్యక్రమం, 14న ఆర్టీసీ డిపోల ఎదుట బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, 16న విద్యార్థుల ర్యాలీలు, 17న ధూందాం కార్యక్రమాలు, 18న బైక్ ర్యాలీలు చేపట్టిన అనంతరం 19వ తేదీన తెలంగాణ బంద్ చేపట్టాలని నిర్ణయించినట్టు జేఏసి స్పష్టం చేసింది.