హైదరాబాద్‌: ఏడాది క్రితమే తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో స్పెషల్‌ పోలీస్‌ (TSSP) ఉద్యోగాలకు ఎంపికై అప్పటి నుంచి శిక్షణ కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు టిఎస్ఎస్పీ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగంలో చేరడం కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్న 3,963 మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరదింపుతూ టిఎస్ఎస్పీ నుంచి అభ్యర్థులకు తీపి కబురు అందింది. నవంబర్‌ 9 నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్టు టిఎస్ఎస్పీ ఆ సందేశంలో పేర్కొంది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ నెల 26 నుంచి కరోనా పరీక్షలకు ( Coronavirus tests ) హాజరుకావాలని టిఎస్ఎస్పీ అభ్యర్థులకు సూచించింది. Also read : FIR against Kathi Kartika: దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థి కత్తి కార్తికపై చీటింగ్ కేసు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టిఎస్ఎస్పీ ట్రైనింగ్ షెడ్యూల్‌ ప్రకారం అంబర్‌పేట, మేడ్చల్, కరీంనగర్, పోలీసు ట్రైనింగ్‌ కాలేజీల్లో ముందుగా అభ్యర్థులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిన అభ్యర్థులను శిక్షణకు అనుమతించి, పాజిటివ్‌ వచ్చిన అభ్యర్థులకు అక్కడే తాత్కాలికంగా క్వారంటైన్‌ అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1వ, 3వ, 7వ, 8వ, 10వ, 13వ, 17వ బెటాలియన్లతో పాటు వరంగల్, మేడ్చల్‌లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీల్లో అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. Also read : Bigg Boss: గోళ్ల‌తో ర‌క్కిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. కంటెస్టంట్ క‌ళ్ల‌కు గాయాలు


సివిల్ పోలీస్, ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్, టిఎస్ఎస్పీ విభాగాల్లో 16 వేల మంది కానిస్టేబుల్స్ పోస్టుల భర్తీ కోసం 2018లో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వెలువడింది. గతేడాది సెప్టెంబర్‌లో పరీక్షల ఫలితాలు వెలువడగా.. ఈ ఏడాది జనవరి రెండో వారంలో సివిల్, ఏఆర్ విభాగాల్లో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించారు. అంతలోనే కరోనా విజృంభణ మొదలవడం, శిక్షణ కేంద్రాల వద్ద సోషల్ డిస్టన్సింగ్ ( Social distancing ) లక్ష్యం దెబ్బతినకుండా అభ్యర్థులకు మౌలిక సదుపాయాలు కల్పించే పరిస్థితి లేకపోవడంతో అప్పటి నుంచి టిఎస్ఎస్పీ అభ్యర్థుల శిక్షణ కార్యక్రమం వాయిదాపడుతూ వస్తోంది. Also read : Jordar Sujatha about BB4 Telugu:అది నా తప్పు కాదు..బిగ్ బాస్ నిర్ణయం: జోర్దార్ సుజాత


ఇదిలావుంటే, మరోవైపు ఈ మధ్య గ్యాప్‌లో సివిల్, ఏఆర్ విభాగాలకు ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ పూర్తి కాగా వారికి పోస్టింగులు ఇవ్వడమే మిగిలి ఉంది. దీంతో తమ ఉద్యోగాల పరిస్థితి ఏంటా అని ఆందోళన చెందుతున్న టిఎస్ఎస్పీ అభ్యర్థులకు తెలంగాణ సర్కారు ఇలా శుభవార్తను తెలియజేసింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe