హైదరాబాద్: టిఎస్ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ని తప్పుపడుతూ అఖిలపక్ష నేతల బృందం నేడు గవర్నర్‌ను కలిసింది. రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ని కలిసిన అఖిలపక్షం నేతలు.. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ వైఖరి ఆర్టీసీ కార్మికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని... ఫలితంగా ఎంతోమంది మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకోగా, ఇంకొంతమంది గుండెపోటుతో కన్నుమూశారని నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇకనైనా కార్మికుల సమస్యలను  పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అఖిలపక్షం నేతలు గవర్నర్‌కు విజ్ఞప్తిచేశారు. 


గవర్నర్‌ని కలిసిన అఖిలపక్ష నేతల బృందంలో టీడీపీ నుంచి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ నుంచి చాడ వెంకట్ రెడ్డి, బీజేపీ నుంచి మోహన్ రెడ్డి, టిజెఎస్ నుంచి కోదండరాం ఉన్నారు.