Hyd Drugs Issue: డ్రగ్స్ దందాకు భాగ్యనగరం అడ్డాగా మారుతోంది. ఎక్కడ మత్తు పదార్థాలు పట్టుబడినా..మూలాలు మాత్రం హైదరాబాద్‌లో బయటపడుతున్నాయి. తాజాగా మరో దందాను పోలీసులు చేధించారు. రెండు అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాలను అరెస్ట్ చేశారు. హ్యాపీ వీకెండ్, హాయ్ బ్రో, హౌ ఫార్‌ యు వంటి కోడ్‌ భాషలతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులకు పట్టుబడిన వారిలో ముగ్గురు ఆఫ్రికన్లు హెన్నీ చిగ్బో, అమోబీ ఛువుడీ, మథియాస్‌, యెమన్ దేశస్థుడు అహ్మద్ కమాల్‌ ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిందితుల నుంచి రూ.13 లక్షల విలువైన కొకైన్, మెటా ఆంఫిటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని సీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. వీరి నుంచి డ్రగ్స్‌ తీసుకున్న వారిని సైతం పోలీసులు గుర్తించారు. ఇందులో ఇప్పటివరకు 23 మందిని అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు డివైన్‌ కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నారు. ఢిల్లీలో ఉంటున్న డివైన్ సుజీ..విమానాలు, అంతర్జాతీయ కొరియర్ల ద్వారా మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.


ఐదేళ్ల క్రితం పర్యాటక వీసాతో నైజీరియా, టాంజానియా నుంచి హెన్రీ చిగ్బో, అమోబీ, మథియాస్‌లు వేర్వేరుగా ఢిల్లీకి వచ్చినట్లు విచారణలో తేలింది. వీసా గడువు ముగిసినా నిందితులంతా వివిధ రాష్ట్రాలు, నగరాల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. మూడేళ్ల నుంచి నిందితులంతా ఢిల్లీ నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి బెంగళూరు, హైదరాబాద్, ముంబై నగరాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేల్చారు. హెన్నీపై బెంగళూరులో కేసు నమోదు అయ్యింది.


అతడిని రెండేళ్ల క్రితమే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఢిల్లీకి వెళ్లాడు. అమోబీపై కూడా కేసులున్నాయి. బెంగళూరులో ఒకటి, హైదరాబాద్‌లో రెండు కేసులు నమోదు అయ్యాయి. అమోబీ పాస్‌పోర్టును బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అతడు హైదరాబాద్‌కు వచ్చారు. మరో ముఠాకు చెందిన మథియాస్‌ నాలుగేళ్ల నుంచి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.


మాస్కులు విక్రయిస్తామంటూ మోసాలకు పాల్పడుతుండగా..అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చాక యెమన్ దేశస్థుడు అహ్మద్ కమాల్‌తో పరిచయం ఏర్పడింది. రెండేళ్ల నుంచి వీరిద్దరూ కలిసి బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తెప్పించుకుంటున్నారు. ఇమ్మానుయేల్‌ నుంచి మెటా ఆంఫిటమైన్‌కు తీసుకొస్తున్నారు. భాగ్యనగరంలో గ్రాము రూ.10 వేలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. డ్రగ్స్‌ విక్రయాలన్నీ ఫోన్ల ద్వారా జరుపుతున్నట్లు తేల్చారు.  


ఇందుకు కొన్ని కోడ్ వాడే వారని పోలీసులు తెలిపారు. వీటి కోసం నాలుగైదు నెట్‌వర్క్‌లు ఉపయోగించినట్లు తెలుస్తోంది. స్నాప్‌ చాట్‌లో మెసెజ్ పంపితే..రెండు, మూడు నిమిషాల్లో అవి డిలేజ్‌ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. దీంతో డ్రగ్స్ సరఫరాపై ఎలాంటి ఆధారాలు ఉండవు. టోలీచౌకిలో డ్రగ్స్‌ సరఫరా అవుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేపట్టారు. బెంగళూరు నుంచి వచ్చిన 20 గ్రాముల కొకైన్‌తోపాటు నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


Also read: Corona Updates in India: భారత్‌లో ఫోర్త్ వేవ్ రానుందా..ఇవాళ్టి కరోనా కేసులు ఎన్నంటే..!


Also read:Mask Must in Telangana: తెలంగాణలో ఇక మాస్క్‌ తప్పనిసరి..ధరించకపోతే భారీ జరిమానా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook