Pay Revision Commission: `రెండు పీఆర్‌సీలు పెండింగ్.. ఆర్టీసీ విలీనం కోసం 15 రోజులే గడువు: జేఏసీ

Two Pay Revision Commissions Pending For RTC Employees: ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత రెడ్డిపై తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు కన్నెర్ర చేశారు. మునుపెన్నడూ లేని విధంగా భారీ సమ్మె చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసు అందించారు.
RTC Pay Revision Commission: ఎన్నికల సమయంలో భారీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటినా నెరవేర్చకుండా మోసం చేస్తున్న రేవంత్ రెడ్డిపై ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మోసంపై ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. రెండు పీఆర్‌సీలు పెండింగ్, ఆర్టీసీని ప్రభుత్వం విలీనం ప్రక్రియ చేయకపోవడంపై ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన అనంతరం ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పినట్టు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం పూర్తి చేయాలని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. పదవీ విరమణ పొందిన బెనిఫిట్స్ అందించాలని విజ్ఞప్తి చేశారు. '2021 పీఆర్‌సీ ప్రకటించాలి. 2017 బకాయిలు చెల్లించాలి. 15 రోజుల్లో యాజమాన్యం స్పందించి మా డిమాండ్స్ నెరవేర్చాలి' అని ఆల్టిమేటం జారీ చేశారు. 'మా డిమాండ్ల సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలను కలుస్తాం. మా పోరాటానికి మద్దతు కూడగడుతాం' అని ప్రకటించారు.
Also Read: Gaddar Award: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. 'ఎంతో మందిని చంపిన వ్యక్తి గద్దర్'
'ప్రభుత్వం విద్యుత్ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించాలి. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతున్నా రేవంత్ రెడ్డి స్పందించడం లేదు. ముఖ్యమంత్రి, మంత్రుల వరకు కలిసినా మా సమస్యలు పరిష్కరించడం లేదు' అని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న అసహనం వ్యక్తం చేశారు. నాటి కేసీఆర్ ప్రభుత్వం విలీన ప్రక్రియ 90 శాతం పూర్తి చేసిందని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. 2021 పీఆర్సీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. '14 నెలలు సమయం ఇచ్చాం. ఇంకా మాకు ఓపిక లేదు. ఆర్టీసీ అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రయివేటు బస్సులు ఆర్టీసీలో ప్రవేశపెట్టి ఆర్టీసీ మనుగడకు ప్రమాదం కలిగేలా చేస్తున్నారు' అని జేఏసీ చైర్మన్ వెంకన్న ఆందోళన వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.