ఇద్దరి ప్రాణాలు బలి..!!
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. పట్టణంలో ప్రయివేట్ ఆస్పత్రి ఇద్దరి ప్రాణాలను బలిగొంది. చికిత్స చేసి సురక్షితంగా ఇంటికి పంపాల్సిన దేవాలయం లాంటి ఆస్పత్రి వారి పాలిట మృత్యుకుటీరంగా తయారైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. పట్టణంలో ప్రయివేట్ ఆస్పత్రి ఇద్దరి ప్రాణాలను బలిగొంది. చికిత్స చేసి సురక్షితంగా ఇంటికి పంపాల్సిన దేవాలయం లాంటి ఆస్పత్రి వారి పాలిట మృత్యుకుటీరంగా తయారైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొన్నాళ్లుగా నడుస్తున్న ప్రయివేట్ ఆస్పత్రి తేజ హాస్పిటల్.. ఇద్దరు మహిళల ప్రాణాలను బలి తీసుకుంది. ఆ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలకు వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోయారు. రుద్రంగి మండలం మానాలకు చెందిన షీలా అనే యువతి పైల్స్ ఆపరేషన్ కోసం తేజ ఆస్పత్రిలో చేరింది. ఐతే ఆమెకు వైద్యులు సరిగా ట్రీట్మెంట్ ఇవ్వలేదు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
[[{"fid":"185920","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
మరోవైపు సిరిసిల్ల పట్టణం గణేష్ నగర్ కు చెందిన మహిళ కల్పన.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం తేజ ఆస్పత్రికి వచ్చింది. ఐతే ఆమె విషయంలోనూ తేజ ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. దీంతో వైద్యం వికటించి కల్పన కూడా ప్రాణాలు విడిచింది. దీంతో ఆస్పత్రిపై రెండు కుటుంబాలకు చెందిన బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఆస్పత్రి యాజమాన్యానికి రాజకీయ పలుకుబడి ఉండడంతో విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు ఆస్పత్రి వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసుతో భద్రత ఏర్పాటు చేయించుకున్నారు. ఐతే పోలీసులు కేసు నమోదు చేయడం లేదని మృతుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..