Ujjaini Mahankali Rangam: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా ముగిశాయి. మహంకాళి ఆలయంలో రంగం నిర్వహించారు. భవిష్యవాణి వినిపించారు జోగిని స్వర్ణలత. ఆలయ నిర్వహణ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మకు సరిగా పూజలు చేయడం లేదని మండిపడ్డారు. మీ సంతోషానికే పూజలు చేస్తున్నారు కాని తన కోసం కాదని భవిష్యవాణిలో చెప్పారు స్వర్ణలత. అమ్మవారు కోరుకున్నట్లు పూజలు చేయడం లేదన్నారు. నా గర్భాలయంలో పూజలు సరిగా జరపడం లేదు అమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.  పూజలు మొక్కుబడిగా కాదు శాస్త్రోతంగా జరపాలని సూచించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో చేసినట్లు పూజలు చేయడం లేదని అమ్మవారు రంగంలో తన కోపం ప్రదర్శించారు.ప్రతి ఏటా కొత్త కొత్త ఆటంకాలు వస్తున్నాయన్నారు. తనకు ఎన్ని రూపాలు మారుస్తారంటూ నిలదీశారు. మీకు నచ్చినట్లు నా రూపం మారుస్తానే ఉంటారా అంటూ మహంకాళి తల్లి రంగంలో అసహనం వ్యక్తం చేశారు. గత వర్షాల నుంచి రూపు లేకుండానే  కూర్చుంటున్నానని చెప్పారు. తన  రూపాన్ని స్థిరంగా ఉంచాలన్నారు.  నా గర్భాలయంలో పూజలు సక్రమంగా చేయడం లేకపోవడం వలనే విపత్తులు వస్తున్నాయని అమ్మ పలికారు. తప్పులు చేస్తున్న జనం కళ్లు తెరిపించడానికే కుండపోతగా వర్షాలు కురిపించానని మహంకాళి అమ్మ తన భవిష్యవాణిలో వెల్లడించారు.


తనకు మొక్కుబడి మూకుమ్మడిగా పూజలు చేస్తున్నారని... అందుకే కుండపోత వర్షం కురిసిందని రంగంలో తమ కోపానికి కారణం చెప్పారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు. తనకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించడానికే ఇలా చేశానన్నారు. మీరంతా చేసిన తప్పులు గ్రహించి సరిదిద్దుకోవడానికే ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. మీరు ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకుంటానన్నారు.మీరేంటి నాకు చేసేది.. నేను తెచ్చుకున్నదే కదా అంటూ అమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగలు దోచినట్లు నాదే కాజేస్తున్నారని  అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.


Also Read: బాయ్ ఫ్రెండ్‌తో శృంగారం చేస్తారా.. జాన్వీ కపూర్ ఏం సమాధానం చెప్పారంటే?


Also Read: Gold Price Today July 18: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి ధరలు ఇవే



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook