Amit Shah Phone Call to Khammam BJP Activist Sai Ganesh Family: ఖమ్మం జిల్లాకు చెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్ సూసైడ్ విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి అలజడి సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి గణేష్ ఆత్మహత్య పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ విషయం ఢిల్లీ అధిష్టానం దృష్టికి చేరింది. కమలనాథులు తమ పార్టీకి చెందిన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. స్వయంగా సాయి గణేష్ ఆత్మహత్య ఘటనపై ఆయన ఆరా తీసినట్టు సమాచారం. మంగళవారం గణేష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించిన అమిత్ షా.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, ఘటనకు కారణమైన ఎవరినీ వదిలిపెట్టబోయేది లేదని హామీ ఇచ్చారు. అయితే ఇంత పెద్ద ఘటన జరిగినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై ఫైర్ అయిన అమిత్ షా.. గణేష్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని బీజేపీ నేతలను ఆదేశించారు. 


ఖమ్మంకు చెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్ మూడు రోజుల క్రితం పోలీసులు తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే అతడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మంత్రి పువ్వాడ, స్థానిక టీఆర్ఎస్ నాయకులతో పాటు సీఐ వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని మరణ వాంగ్మూలం ఇచ్చాడు గణేష్. 


గణేష్ మరణ వాంగ్మూలంతో ఖమ్మంలో ఒక్కసారిగా రచ్చ మొదలైంది. మంత్రి పువ్వాడపై బీజేపీ నేతలు విమర్శలతో విరుచుకుపడ్డారు. అంతేకాదు బీజేపీ కార్యకర్తలు మంత్రి పువ్వాడ ఫ్లెక్సీలు, కటౌట్లకు దగ్ధం చేస్తూ భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు ఢిల్లీని తగిలిన గణేష్ ఆత్మహత్య సెగ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగడంతో ప్రస్తుతం అక్కడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 


Also Read: Allu Arjun: భారీ ఆఫర్‌ను తిరస్కరించిన అల్లు అర్జున్‌.. అసలు కారణం ఇదే!


Also Read: DC vs PBKS: కరోనా వైరస్ ఎఫెక్ట్.. ఐపీఎల్ 2022పై కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook