Pushpa star Allu Arjun rejects Tobacco commercial Ad: 'గంగోత్రి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. మొదటి సినిమాలోనే తన నటనతో ఆకట్టుకున్నాడు. ఆర్య సినిమాతో సూపర్ హిట్ అందుకుని యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. బన్నీ, దేశముదురు, పరుగు, వరుడు, ఆర్య 2, వేదం, బద్రీనాథ్ సినిమాలతో స్టార్ అయ్యాడు. జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, డీజే, నా పేరు సూర్య, అలా వైకుంఠపురంలో సినిమాలతో బన్నీ ఇండస్ట్రీలోకి తనకంటూ ఓ ఐడెంటీటి క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు డ్యాన్స్, స్టైలిష్ లుక్‌తో అల్లు అర్జున్ 'యూత్ ఐకాన్'గా నిలిచాడు.
ఇక గతేడాది చివరలో వచ్చిన 'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీక్ వద్ద పెద్ద ప్రభజంజనమే సృష్టించింది. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న బన్నీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ ఓ భారీ ఆఫర్‌ను తిరస్కరించాడని సమాచారం తెలుస్తోంది. కోట్లు ఆఫర్ చేసిన ఓ బ్రాండ్ ప్రకటనకు ఐకాన్ స్టార్ నో చెప్పాడని ఫిల్మ్ నగర్ టాక్. అందుకు కారణం కూడా ఉందట.
ఇప్పటికే రాపిడో, జొమాటో కంపెనీలకు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ పొగాకు కంపెనీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు బన్నీని సంప్రదించిందట. భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ను కూడా ఆఫర్ చేసిందట. ఈ ఆఫర్‌ను ఐకాన్ స్టార్ సున్నితంగా తిరస్కరించాడట. పొగాకు ఆరోగ్యానికి హానికరమని, అలాంటి ఉత్పత్తులకు తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండనని సదరు కంపెనీకి బన్నీ చెప్పాడట.
విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పుష్ప సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న బన్నీ.. ఇటీవల తన బర్త్‌డే సందర్భంగా కుటుంబంతో కలిసి సెర్భియా టూర్‌కు వెళ్లాడు. తాజాగా ఇండియాకు వచ్చిన బన్నీ.. త్వరలోనే పుష్ప పార్ట్ 2 షూటింగ్‌లో పాల్గొననున్నాడు. పుష్ప 2 కోసం ఆయన ఫాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అనంతరం సంజయ్ లీలా బన్సాలి, వేణు శ్రీరామ్, కొరటాల శివతో బన్నీ సినిమాలు చేయనున్నారు.
Also Read: Kajal Agarwal: బాబుకి జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్.. ట్విట్టర్ లో హోరెత్తుతున్న విషెస్
Also Read: DC vs PBKS: కరోనా వైరస్ ఎఫెక్ట్.. ఐపీఎల్ 2022పై కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook